SA vs IND 2nd Test: టీమిండియా పేసర్ల ఫైరింగ్.. 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్.. 6 వికెట్లతో మెరిసిన సిరాజ్..
South Africa vs India, 2nd Test: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 55 పరుగులకు ఆలౌటైంది. భారత్‌పై అత్యల్ప స్కోరుకే ఆ జట్టు పెవిలియన్ చేరింది. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికా కేవలం 23.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయగలిగింది. భారత్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో సత్తా చాటాడు.

దక్షిణాఫ్రికా తరపున కైల్ వేరియన్ 15, డేవిడ్ బెడింగ్‌హామ్ 12 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్ 6 పరుగుల స్కోరును కూడా దాటలేకపోయారు. భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ తలో 2 వికెట్లు తీశారు.
భారత్‌పై అత్యల్ప స్కోరు..
దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క సెషన్ కూడా ఆడలేకపోయింది. ఆ జట్టు కేవలం 23.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 55 పరుగులకే ఆలౌటైంది. భారత్‌పై జట్టుకు ఇదే అతి తక్కువ స్కోరు కావడం గమనార్హం. అంతకుముందు 2015లో నాగ్‌పూర్ గడ్డపై సౌతాఫ్రికా జట్టు 79 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దక్షిణాఫ్రికాలో అంతకుముందు 2006లో ఆ జట్టు 84 పరుగుల స్కోరు వద్ద అవుటైంది. దక్షిణాఫ్రికా జట్టు 100 పరుగుల వ్యవధిలో ఆలౌట్ కావడం భారత్‌పై ఇది మూడోసారి.
View this post on Instagram
రెండు జట్ల ప్లేయింగ్-11..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.
View this post on Instagram
దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డిజార్జ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వేరియన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి, నాండ్రే బెర్గర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..