AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shimron Hetmyer: తండ్రిగా ప్రమోషన్‌ పొందిన రాజస్థాన్‌ స్టార్‌ ప్లేయర్‌.. బిడ్డ ఫొటోనూ షేర్‌ చేస్తూ ఎమోషనల్‌..

IPL 2022: ఐపీఎల్‌-2022లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హెట్ మైర్ టోర్నీ మధ్యలోనే జట్టును వీడాడు. తన స్వస్థలమైన గయానాకు వెళ్లిపోయాడు. కాగా మొదటిసారి తండ్రైన హెట్‌మైర్‌ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

Shimron Hetmyer: తండ్రిగా ప్రమోషన్‌ పొందిన రాజస్థాన్‌ స్టార్‌ ప్లేయర్‌.. బిడ్డ ఫొటోనూ షేర్‌ చేస్తూ ఎమోషనల్‌..
Shimron Hetmyer
Basha Shek
|

Updated on: May 10, 2022 | 9:06 PM

Share

IPL 2022: వెస్టిండీస్‌ స్టార్‌ ఆటగాడు షిమ్రన్‌ హెట్‌మైర్‌ (Shimron Hetmyer) తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. అతని సతీమణి నిర్వాని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఐపీఎల్‌-2022లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను టోర్నీ మధ్యలోనే జట్టును వీడాడు. తన స్వస్థలమైన గయానాకు వెళ్లిపోయాడు. కాగా మొదటిసారి తండ్రైన హెట్‌మైర్‌ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ సందర్భంగా తన సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నాడు. ‘ఈ ప్రపంచంలోకి స్వాగతం. చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఐలవ్యూ’ అంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్‌ చేశాడు. ఇందులో హెట్‌మైర్‌ తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని తదేకంగా చూస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా ఐపీఎల్ 2022 మెగా వేలంలో షిమ్రన్‌ హెట్‌మైర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ. 8.5 కోట్లకు కొనుగోలు చేసింది. అందుకు తగ్గట్లే అద్భుతంగా రాణిస్తున్నాడీ స్టార్‌ ప్లేయర్‌. ఫినిషర్‌గా జట్టుకు అద్భుత విజయాలు అందిస్తున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన హెట్‌మైర్‌ 72.75 సగటుతో 291 పరుగులు చేశాడు. ఇక రాజస్థాన్‌ విషయానికొస్తే.. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు మూడో స్థానంలో ఉంది. కాగా త్వరలోనే రాజస్థాన్‌ జట్టులోకి హెట్‌ మైర్‌ చేరనున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Mahesh babu: మహేశ్‌- రాజమౌళి సినిమా మొదలయ్యేది అప్పుడే.. విజయేంద్ర ప్రసాద్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Vijay Thalapathy: విజయ్‌- వంశీపైడిపల్లి సినిమా విడుదలయ్యేది అప్పుడే.. క్యాస్టింగ్‌తో పాటు రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన మూవీ మేకర్స్‌..

Sri Lanka Crisis: మహీంద రాజపక్స కుటుంబాన్ని వెంటాడుతోన్న ఆందోళన కారులు.. నేవీ స్థావరంలో  తల దాచుకున్నా..