LSG vs GT, Highlights IPL 2022: లక్నో 82 పరుగులకి ఆలౌట్‌.. గుజరాత్ టైటాన్స్‌ ఘన విజయం

| Edited By: uppula Raju

Updated on: May 10, 2022 | 11:20 PM

Lucknow Super Giants vs Gujarat Titans Highlights: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. దీంతో లక్నో టీం ముందు 145 పరుగుల టార్గెట్ ఉంది.

LSG vs GT, Highlights IPL 2022: లక్నో 82 పరుగులకి ఆలౌట్‌.. గుజరాత్ టైటాన్స్‌ ఘన విజయం
Lsg Vs Gt, Live Score, Ipl 2022

LSG vs GT, Highlights IPL 2022: ఐపీఎల్ 2022లో భాగంగా ఈ రోజు గుజరాత్ టైటాన్స్‌, లక్నో సూపర్ జెయింట్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఏ మాత్రం పోటీనివ్వలేదు. కేవలం 82 పరుగులకే ఆలౌట్‌ అయింది.  మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా జరిగింది. గుజరాత్‌ బౌలర్ల ధాటికి లక్నో బ్యాటర్లు విలవిలలాడారు. ఏ మాత్రం క్రీజులో నిలవలేకపోయారు. దీపక్ హుడా 27 పరుగులు మినహాయించి ఎవ్వరూ రెండంకెల స్కోరు చేయలేదు. గుజరాత్‌ బౌలర్లు అద్భుతంగా రాణించారు. రషీద్‌ ఖాన్‌ 4, యశ్‌ దయాల్‌ 2, మహమ్మద్‌ షమి 1, రషీద్‌ఖాన్‌1 వికెట్‌ సాధించారు. ఈ విజయంతో గుజరాత్ అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరింది.

అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో శుభమాన్ గిల్ నాలుగో అర్థసెంచరీతో అజేయంగా 63 పరుగులు చేశాడు. లక్నో తరపున ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ గరిష్టంగా రెండు వికెట్లు పడగొట్టాడు. వృద్ధిమాన్ సాహా 11 బంతుల్లో 5 పరుగులు చేసి మొహ్సిన్ ఖాన్‌కు బలయ్యాడు. మాథ్యూ వేడ్ (10) వికెట్ ను అవేశ్ ఖాన్ పడగొట్టాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (11) వికెట్ కూడా అవేష్ ఖాన్ కు దక్కింది. డేవిడ్ మిల్లర్ 26 పరుగులు చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఆయుష్ బదోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఇరు జట్లు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కరణ్ శర్మ, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 10 May 2022 10:52 PM (IST)

    లక్నో 82 పరుగులకి ఆలౌట్‌.. గుజరాత్ టైటాన్స్‌ ఘన విజయం

    లక్నో 13.5 ఓవర్లలో 82 పరుగులకి ఆలౌట్‌ అయింది. దీంతో గుజరాత్ 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. గుజరాత్‌ టైటాన్స్‌ నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో లక్నో ఘోరంగా విఫలమైంది. దీపక్ హుడా 27 పరుగులు మినహాయించి ఎవ్వరూ రెండంకెల స్కోరు చేయలేదు. గుజరాత్‌ బౌలర్లు అద్భుతంగా రాణించారు. రషీద్‌ ఖాన్‌ 4, యశ్‌ దయాల్‌ 2, మహమ్మద్‌ షమి 1, రషీద్‌ఖాన్‌1 వికెట్‌ సాధించారు.

  • 10 May 2022 10:41 PM (IST)

    ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన లక్నో

    లక్నో ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. మొహ్సిన్ ఖాన్ 1 పరుగుకే ఔటయ్యాడు. దీంతో 8 వికెట్ల నష్టానికి లక్నో 70 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 42 బంతుల్లో 75 పరుగులు చేయాల్సి ఉంది.

  • 10 May 2022 10:36 PM (IST)

    ఏడో వికెట్‌ కోల్పోయిన లక్నో

    లక్నో ఏడో వికెట్‌ కోల్పోయింది. జాసన్‌ హోల్డర్‌ 1 పరుగు వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 7 వికెట్ల నష్టానికి లక్నో 68 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 46 బంతుల్లో పరుగులు 77 చేయాల్సి ఉంది.

  • 10 May 2022 10:32 PM (IST)

    ఆరో వికెట్‌ కోల్పోయిన లక్నో

    లక్నో ఆరో వికెట్‌ కోల్పోయింది. మార్కస్ స్టోయినిస్ 2 పరుగుల వద్ద రనౌట్‌ అయ్యాడు. దీంతో 6 వికెట్ల నష్టానికి లక్నో 65 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 52 బంతుల్లో 80 పరుగులు చేయాల్సి ఉంది.

  • 10 May 2022 10:29 PM (IST)

    ఐదో వికెట్‌ కోల్పోయిన లక్నో

    లక్నో ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆయుష్‌ బదోని 8 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో 5 వికెట్ల నష్టానికి లక్నో 61 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 54 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది.

  • 10 May 2022 10:23 PM (IST)

    10 ఓవర్లకి లక్నో లక్నో సూపర్ జెయింట్స్ 58/4

    లక్నో 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో దీపక్ హుడా 21 పరుగులు, ఆయుష్‌ బదోని 7 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 60 బంతుల్లో 87 పరుగులు చేయాల్సి ఉంది. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో యశ్‌ దయాల్‌ 2, మహమ్మద్‌ షమి 1, రషీద్‌ఖాన్‌1 వికెట్‌ సాధించారు.

  • 10 May 2022 10:18 PM (IST)

    50 పరుగులు దాటిన లక్నో సూపర్ జెయింట్స్

    లక్నో 8.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. క్రీజులో దీపక్ హుడా 18 పరుగులు, ఆయుష్‌ బదోని 6 పరుగులతో ఆడుతున్నారు. విజయానికి ఇంకా 67 బంతుల్లో 92 పరుగులు చేయాల్సి ఉంది. గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో యశ్‌ దయాల్‌ 2, మహమ్మద్‌ షమి 1, రషీద్‌ఖాన్‌1 వికెట్‌ సాధించారు.

  • 10 May 2022 10:12 PM (IST)

    నాలుగో వికెట్‌ కోల్పోయిన లక్నో

    లక్నో నాలుగో వికెట్‌ కోల్పోయింది. కృనాల్‌ పాండ్య 5 పరుగులకే ఔటయ్యాడు. దీంతో 4 వికెట్ల నష్టానికి లక్నో 45 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 75 బంతుల్లో 100 పరుగులు చేయాల్సి ఉంది.

  • 10 May 2022 09:55 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన లక్నో..

    కేఎల్ రాహుల్ (8) రూపంలో లక్నో టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. దీంతో 4.5 ఓవర్లు పూర్తయ్యే సరికి రెండు వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది.

  • 10 May 2022 09:49 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన లక్నో..

    క్వింటన్ డికాక్ (11) రూపంలో లక్నో టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. దీంతో 4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది.

  • 10 May 2022 09:19 PM (IST)

    లక్నో టార్గెట్ 145

    ఐపీఎల్ 2022లో భాగంగా 57వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టీంతో లక్నో సూపర్ జెయింట్‌ తలపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో శుభమాన్ గిల్ నాలుగో అర్థసెంచరీతో అజేయంగా 63 పరుగులు చేశాడు. లక్నో తరపున ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ గరిష్టంగా రెండు వికెట్లు పడగొట్టాడు.

  • 10 May 2022 09:03 PM (IST)

    18 ఓవర్లు ముగిసే గుజరాత్ స్కోర్..

    18 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టీం 4 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 61, రాహుల్ తెవాటియా 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 10 May 2022 08:51 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్..

    డేవిడ్ మిల్లర్ (26) రూపంలో గుజరాత్ టైటాన్స్ టీం నాలుగో వికెట్‌ను కోల్పోయింది. హోల్డర్ బౌలింగ్‌లో ఆయుష్ బదోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో గుజరాత్ 15.6 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది.

  • 10 May 2022 08:45 PM (IST)

    15 ఓవర్లు ముగిసే గుజరాత్ స్కోర్..

    15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టీం 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 47, డేవిడ్ మిల్లర్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 10 May 2022 08:19 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్..

    హర్దిక్ పాండ్యా (11) రూపంలో గుజరాత్ టైటాన్స్ టీం మూడో వికెట్‌ను కోల్పోయింది. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో గుజరాత్ 9.1 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది.

  • 10 May 2022 08:15 PM (IST)

    9 ఓవర్లు ముగిసే గుజరాత్ స్కోర్..

    9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టీం 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. హర్దిక్ పాండ్య 11, శుభ్మన్ గిల్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 10 May 2022 08:05 PM (IST)

    7 ఓవర్లు ముగిసే గుజరాత్ స్కోర్..

    7 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టీం 2 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. హర్దిక్ పాండ్య 3, శుభ్మన్ గిల్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 10 May 2022 07:54 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్..

    మాథ్యూ వాడే (10) రూపంలో గుజరాత్ టైటాన్స్ టీం రెండో వికెట్‌ను కోల్పోయింది. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో గుజరాత్ 4.2 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది.

  • 10 May 2022 07:46 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్..

    సాహా(5) రూపంలో గుజరాత్ టైటాన్స్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. ఖాన్ బౌలింగ్‌లో అవేష్ ఖాన్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో గుజరాత్ 3 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది.

  • 10 May 2022 07:08 PM (IST)

    Lucknow vs Gujarat, LIVE Score: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు..

    లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కరణ్ శర్మ, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్

  • 10 May 2022 07:07 PM (IST)

    Lucknow vs Gujarat, LIVE Score: గుజరాత్ టైటాన్స్ జట్టు..

    గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

  • 10 May 2022 07:05 PM (IST)

    Lucknow vs Gujarat, LIVE Score: టాస్ గెలిచిన గుజరాత్..

    టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. తొలుత బ్యాటింగ్ చేయనుంది. దీంతో లక్నో టీం మొదట బౌలింగ్ చేయనుంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించగా, నేడు లక్నో టీం హార్దిక్ సేనను ఓడించాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

  • 10 May 2022 07:00 PM (IST)

    Lucknow vs Gujarat, LIVE Score: గుజరాత్ కష్టాలను పెంచేందుకు సిద్ధమైన కేఎల్ రాహుల్..

    కేఎల్ రాహుల్ లక్నో ముందుండి నడిపించాడు. అతను ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 451 పరుగులు చేశాడు. లక్నో జట్టు బ్యాటింగ్‌లో అతనిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది.

  • 10 May 2022 07:00 PM (IST)

    Lucknow vs Gujarat, LIVE Score: గుజరాత్ ఓటమితో లక్నోకు ప్రయోజనం..

    లీగ్‌లో గుజరాత్ చాలా కాలం పాటు అగ్రస్థానంలో ఉన్నప్పటికీ బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో దాని స్థానంలో లక్నో అగ్రస్థానానికి చేరుకుంది.

  • 10 May 2022 06:59 PM (IST)

    Lucknow vs Gujarat, LIVE Score: లక్నోతో గుజరాత్‌ పోరు..

    తొలిసారిగా ఐపీఎల్‌లో పాల్గొంటున్న గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు నేడు రెండోసారి తలపడనున్నాయి. ప్లేఆఫ్‌లో చోటు దక్కించుకోవడంపైనే ఇరు జట్ల దృష్టి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు ఏ జట్టు గెలిస్తే దాని స్థానం ఖాయం అవుతుంది.

Published On - May 10,2022 6:51 PM

Follow us
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..