AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అల్లుడి బౌలింగ్‌లో ఇరగదీసిన మామ.. భారీ సిక్సర్‌తో దిమ్మతిరిగే షాక్.. వైరల్ వీడియో

షాహిన్‌ అఫ్రిది శుక్రవారం షాహిద్‌ అఫ్రిది కూతురు అన్షాను నిఖా చేసుకున్నాడు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. అయితే, తాజాగా షాహీన్, షాహీద్‌ల వీడియో ఒకటి బయటకు వచ్చింది.

Watch Video: అల్లుడి బౌలింగ్‌లో ఇరగదీసిన మామ.. భారీ సిక్సర్‌తో దిమ్మతిరిగే షాక్.. వైరల్ వీడియో
Shaheen Bowls Shahid
Venkata Chari
|

Updated on: Feb 04, 2023 | 11:39 AM

Share

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) రాబోయే సీజన్ కోసం పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది సిద్ధమవుతున్నాడు. గతేడాది, టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ సమయంలో షాహీన్‌ మోకాలి గాయమైన సంగతి తెలిసిందే. పాక్ స్టార్ బౌలర్ పీఎస్‌ఎల్-8కి ముందు పూర్తి ఫిట్‌నెస్‌ని తిరిగి పొందడానికి నెట్స్‌లో చెమటలు పట్టిస్తున్నట్లు కనిపించాడు. కాగా, షాహిన్‌ అఫ్రిది శుక్రవారం షాహిద్‌ అఫ్రిది కూతురు అన్షాను నిఖా చేసుకున్నాడు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. అయితే, తాజాగా షాహీన్, షాహీద్‌ల వీడియో ఒకటి బయటకు వచ్చింది. నిఖాతో ఇరు కుటుంబాల్లో సందడి నెలకొనగా.. అల్లుడు బౌలింగ్‌లో మామా బ్యాటింగ్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అయితే, ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాత్రం షాహీన్‌ బౌలింగ్‌లో విరుచుకుపడ్డాడు. శిక్షణ సమయంలో ఓ భారీ షాట్ ఆడాడు. ఈ వీడియో నెట్టింట్లో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మాజీ క్రికెటర్ షాహీన్ అఫ్రిదీ భారీ సిక్స్ కొట్టడంతో.. నెటిజన్లు షాహీన్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ పాకిస్తాన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది: “వయస్సు కేవలం ఒక సంఖ్య #PakistanCricket #ShahidAfridi” అంటూ షాహీద్ అఫ్రిదీపై క్యాఫ్షన్ అందించింది.

ఇవి కూడా చదవండి

అఫ్రిదీ భారీ సిక్సర్ వీడియో..

ఇటీవల పీఎస్‌ఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ లాహోర్ ఖలాండర్స్‌కు నాయకత్వం వహించిన షాహీన్, తన పునరావాస రోజుల గురించి చెప్పుకొచ్చాడు. ఒకానొక సమయంలో తాను క్రికెట్‌కు స్వస్తి చెప్పబోతున్నానని, అయితే తన పాత వీడియోలను చూసి తనను తాను ప్రేరేపించుకున్నానని తెలిపాడు.

పీఎస్ఎల్ ఎనిమిదవ సీజన్ ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో షాహీన్ నేతృత్వంలోని లాహోర్ ఖలాండర్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్‌తో తొలి మ్యాచ్‌లో తలపడుతుంది.

షాహీన్ గత సీజన్‌లో లాహోర్ ఖలందర్స్‌కు మొదటి PSL (పాకిస్తాన్ సూపర్ లీగ్) టైటిల్‌ను అందించాడు. కెప్టెన్సీతో పాటు, షాహీన్ బంతి, బ్యాట్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..