IND vs AUS: వాళ్ల దెబ్బకు వణికిపోతోన్న ఆస్ట్రేలియా.. స్పెషల్ పిచ్‌లపై ప్రాక్టీస్.. అట్లుంటది మనతో అంటోన్న ఫ్యాన్స్..

India vs Australia 1st Test: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. తొలి మ్యాచ్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.

IND vs AUS: వాళ్ల దెబ్బకు వణికిపోతోన్న ఆస్ట్రేలియా.. స్పెషల్ పిచ్‌లపై ప్రాక్టీస్.. అట్లుంటది మనతో అంటోన్న ఫ్యాన్స్..
Ind Vs Aus Test Match
Follow us

|

Updated on: Feb 04, 2023 | 12:05 PM

India vs Australia 1st Test: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. తొలి మ్యాచ్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టిన ఇరుజట్లు.. నెట్ సెషన్‌లో చెమటలు పట్టిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఈసారి భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలిచేందుకు పక్కాగా ప్లాన్ వేస్తోంది. టీమిండియా బలమైన స్పిన్ ఉచ్చులో పడకుండా ఉండేందుకు సన్నద్ధమవుతోంది. ప్రత్యేకంగా తయారుచేసిన పిచ్‌లపై ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. ఆస్ట్రేలియా శిక్షణ పిచ్‌ల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ చేసేందుకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మూడు వేర్వేరు పిచ్‌లను సిద్ధం చేసింది. పిచ్‌పై మలుపులు ఉండేలా స్పెషల్‌గా తయారు చేయించారంట. ఇందుకోసం పగిలిన పిచ్‌లను సిద్ధం చేసుకుని, తెగ ప్రాక్టీస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

అలాగే, భారత స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఇందుకోసం అశ్విన్ బౌలింగ్ యాక్షన్‌ను తలపించే స్పిన్ బౌలర్ మహేశ్ పిథియా జట్టుతో చేరాడు. మహేష్ పిథియా బౌలింగ్‌ను స్టీవ్ స్మిత్‌తో సహా ఆటగాళ్లు ఎదుర్కొంటున్న వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..