Team India: జాతీయ గీతాలాపనలో అలా చేస్తారా? టీమిండియా క్రికెటర్లపై అభిమానుల ఆగ్రహం.. వీడియో వైరల్
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం (నవంబర్ 08) డర్బన్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. విజయం సంగతి పక్కన పెడితే.. ఈ మ్యాచ్ లో టీమిండియా క్రికెటర్లు చేసిన పని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. మొదటి టీ20 మ్యాచ్ లో ఆతిథ్య జట్టుపై 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపించేందుకు ఇరు జట్లు మైదానానికి వచ్చాయి. మైదానంలో తొలిసారిగా భారత జాతీయ గీతాన్ని వినిపించారు. అయితే సాంకేతిక లోపంతో భారత జాతీయ గీతం సగంలో ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ మొదటి నుంచి జాతీయ గీతాలాపన ప్రారంభించారు. మళ్లీ అదే సమస్యతో రెండోసారి జాతీయ గీతాన్ని నిలిపివేశారు. ఈ సమయంలో జాతీయ గీతం ఆలపిస్తున్న టీమిండియా ఆటగాళ్లు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. చివరగా మూడోసారి భారత జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించారు. అయితే ఇలా కట్ అవుతూ జాతీయ గీతం రావడంతో టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ నవ్వుకున్నారు. ఇప్పుడు దీనినే క్రికెట్ అభిమానులు, నెటిజన్లు తప్పుబడుతున్నారు. జాతీయ గీతాలపన సమయంలో అంతరాయం కలిగితే ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది పోయి పగలబడి నవ్వుతారా? అంటూ మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా హార్దిక్, అక్షర్ ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో క్రికెట్ సౌతాఫ్రికా బోర్డు నిర్లక్ష్య ధోరణిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా జాతీయ గీతాన్ని పూర్తి చేయడానికి సమయ పరిమితిని నిర్ణయించారు. భారత జాతీయ గీతాన్ని కేవలం 52 సెకన్లలో పూర్తి చేయాలి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం ఈ నిబంధనలకు పరిమితులు ఉంటాయి. అయితే క్రికెట్ సౌతాఫ్రికా రెండుసార్లు భారత జాతీయ గీతాన్ని ఆపి, ఆపై దానిని పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో భారత జాతీయ గీతాన్ని ఇలా అవమానించడం సరికాదంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి భారత క్రికెటర్లు, క్రికెట్ సౌతాఫ్రికా తన తప్పును ఎలా సరిదిద్దుకుంటారో చూడాలి.
నెట్టంట వైరలవుతోన్న వీడియో ఇదే..
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 8, 2024
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై ఆగ్రహం..
Technical issues while playing India national anthem at South Africa #INDvSA pic.twitter.com/zERCrEi3DV
— Mr.Perfect 🗿 (@gotnochills007) November 8, 2024
భారత్ ఘన విజయం..
A clinical bowling display by #TeamIndia in Durban👌👌
South Africa all out for 141.
India win the 1st #SAvIND T20I by 61 runs and take a 1-0 lead in the series 👏👏
Scorecard – https://t.co/0NYhIHEpq0 pic.twitter.com/36MRC63RHD
— BCCI (@BCCI) November 8, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








