Video: ఇలాంటి బ్యాటింగ్ నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్.. ఒంటిచేత్తో రివర్స్ షాట్.. కీపర్‌కు తృటిలో తప్పిన భారీ ప్రమాదం..

Moeen Ali One Handed Reverse Slog Video: ఒక్కో బ్యాట్స్‌మెన్ ఒక్కోలా బ్యాటింగ్ చేస్తూ.. తమ ప్రత్యేకతను చాటుకుంటుంటారు. తమ ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులకు అలరిస్తుంటారు. ఈ క్రమంలో సచిన్, గంగూలీ నుంచి తాజాగా సూర్యకుమార్ యాదవ్ వరకు..

Video: ఇలాంటి బ్యాటింగ్  నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్.. ఒంటిచేత్తో రివర్స్ షాట్.. కీపర్‌కు తృటిలో తప్పిన భారీ ప్రమాదం..
Moeen Ali One Handed Reverse Slog Video
Follow us
Venkata Chari

|

Updated on: Feb 02, 2023 | 12:41 PM

ఒక్కో బ్యాట్స్‌మెన్ ఒక్కోలా బ్యాటింగ్ చేస్తూ.. తమ ప్రత్యేకతను చాటుకుంటుంటారు. తమ ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులకు అలరిస్తుంటారు. ఈ క్రమంలో సచిన్, గంగూలీ నుంచి తాజాగా సూర్యకుమార్ యాదవ్ వరకు ఎంతో మంది ఉన్నారు. అయితే, ప్రస్తుతం నెట్టింట్లో ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొయిన్ అలీ ఓ అద్భుతమైన షాట్ కారణంగాగా ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతున్నాడు. ఈ షాట్ చూస్తే బిత్తరపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది క్రికెట్‌లో ఎప్పుడూ చూసి ఉండరు. బట్లర్‌, మలాన్‌లు తుఫాన్ సెంచరీలు చేసిన మ్యాచ్‌‌లో.. జోఫ్రా ఆర్చర్ బంతితో ఆరు వికెట్లు పడగొట్టిన ఇదే మ్యాచ్‌లో.. మొయిన్ అలీ ఒంటి చేత్తో షాట్ ఆడి, ట్రెండ్ అవుతున్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 346 పరుగులు చేసింది. కాగా, ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 44వ ఓవర్ జరుగుతుండగా.. మొయిన్ అలీ అందరి దృష్టిని ఆకర్షించాడు. జెంటిల్‌మన్ గేమ్‌గా పిలచే క్రికెట్‌లో ఇంతకు ముందు ఎవ్వరూ చూడని ప్రయోగాన్ని అతను క్రీజులో చేశాడు.

ఇవి కూడా చదవండి

మొయిన్ అలీ వెరైటీ షాట్.. కొద్దిలో తప్పిన ప్రాణాపాయం..

మొయిన్ అలీ ఆడిన షాట్ ఒంటి చేత్తో ఆడేశాడు. 44వ ఓవర్ నాలుగో బంతికి అతను ఈ షాట్ ఆడాడు. ఈ ఓవర్ తబ్రేజ్ షమ్సీ బౌలింగ్ చేస్తున్నాడు. అలీ తన కొత్త షాట్ గురించి ప్రపంచానికి తెలియజేశాడు. ఈ షాట్‌ను వ్యాఖ్యానించడం క్రికెట్ పండితులకు కూడా కష్టమైంది. ఇలా జరగడం తాను మొదటిసారి చూశామంటూ వారు చెప్పుకొచ్చారు. అయితే, ఇదే షాట్‌లో వెనకాల ఉన్న కీపర్‌కు కొద్దిలో ప్రాణాపాయం తప్పింది. అది వీడియోలో చూడొచ్చు.

వెరైటీ షాట్‌తో ప్రయోగాలు..

స్వీప్, రివర్స్ స్వీప్ వంటి షాట్‌లను తప్పక చూసి ఉంటారు. కానీ, సాధారణంగా బ్యాట్స్‌మెన్ రెండు చేతులతో ఇలాంటి షాట్లు ఆడుతుంటారు. కానీ, ఇక్కడ మొయిన్ అలీ ఒక చేత్తో రివర్స్ షాట్ ఆడడం కనిపించింది. అయితే, ఈ షాట్‌ను పూర్తి చేయండంలో అలీ సక్సెస్ కాలేదు. క్రికెట్ మారుతున్న కాలంలో అలీ చేసిన ఈ ప్రయోగం బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

23 బంతుల్లో 43 పరుగులు..

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో మొయిన్ అలీ ఈ షాట్ ఆడడమే కాకుండా తుఫాను బ్యాటింగ్ కూడా చేశాడు. 178కి పైగా స్ట్రైక్ రేట్‌తో కేవలం 23 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 43 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?