AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 సిక్సర్లు, 13 ఫోర్లతో 249 పరుగులు.. నెక్స్ట్ లెవల్ ఊచకోత.. గిల్ కంటే ముందే విధ్వంసం సృష్టించిన ఇద్దరు..

కింబర్లీలో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. జోస్ బట్లర్, డేవిడ్ మలన్ సెంచరీలతో సౌతాఫ్రికా బౌలర్లను చీల్చి చెండాడారు.

13 సిక్సర్లు, 13 ఫోర్లతో 249 పరుగులు.. నెక్స్ట్ లెవల్ ఊచకోత.. గిల్ కంటే ముందే విధ్వంసం సృష్టించిన ఇద్దరు..
Dawid Malan Jos Buttler
Venkata Chari
|

Updated on: Feb 02, 2023 | 12:29 PM

Share

భారత్‌లో శుభ్మన్ గిల్‌ పొట్టి ఫార్మాట్‌లో సెంచరీతో కివీస్ బౌలర్లను దంచికొట్టాడు. అయితే, మరోవైపు ఇంగ్లండ్‌కు చెందిన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు కూడా ఇలాంటి ఇన్నింగ్స్‌ని ఆడిఆశ్చర్యపరిచారు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్స్ జాస్‌ బట్లర్‌, డేవిడ్‌ మలన్‌ బుధవారం సెంచరీల చెలరేగి, సౌతాఫ్రికా బౌలర్లపై భీకర దాడి చేశారు. మలాన్ 118, బట్లర్ 131 పరుగులు చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 232 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మలాన్‌, బట్లర్‌ బ్యాటింగ్‌ ఆధారంగా ఇంగ్లండ్‌ మూడో వన్డేలో 59 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఒకానొక సమయంలో ఇంగ్లండ్ కేవలం 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. జాసన్ రాయ్ డకెట్ కాగా, హ్యారీ బ్రూక్ కూడా త్వరగానే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్, మలన్ సెంచరీలతో జట్టును 346 పరుగుల భారీ స్కోరుకు తీసుకెళ్లారు. అనంతరం సమాధానంగా దక్షిణాఫ్రికా జట్టు 287 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ విజయంలో జోఫ్రా ఆర్చర్ 6 వికెట్లు పడగొట్టి, సత్తా చాటాడు. అయితే దక్షిణాఫ్రికా 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.

బట్లర్, మలన్ సెంచరీలు..

జాసన్ రాయ్ (1), బెన్ డకెట్ (0), హ్యారీ బ్రూక్ (6) తర్వగా పెవిలియన్‌కు చేరుకున్నారు. మలన్ తన 114 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో రాణించగా, బట్లర్ 127 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు బాదేశారు. వీరిద్దరూ కలిసి మొత్తం 13 సిక్సర్లు, 13 ఫోర్లు బాదారు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత, మొయిన్ అలీ 23 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 43 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఈ మైదానంలో ఇంగ్లండ్ భారీ వన్డే స్కోర్‌ నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. 2012లో శ్రీలంక ఐదు వికెట్లకు 304 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కగిసో రబడా, ఎన్రిచ్ నార్కియాలకు విశ్రాంతినిచ్చింది. లుంగీ ఎన్‌గిడి 62 పరుగులిచ్చి 4 వికెట్లతో జట్టులో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.

ఇప్పటికీ ప్రపంచకప్‌నకు అర్హత సాధించని దక్షిణాఫ్రికా..

ఈ ఏడాది భారత్‌లో జరగనున్న 50 ఓవర్ల ప్రపంచకప్‌నకు దక్షిణాఫ్రికా ఇంకా అర్హత సాధించలేకపోదు. ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. నెదర్లాండ్స్‌తో అర్హత సాధించేందుకు ఆ జట్టుకు రెండు వన్డేలు మిగిలి ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌నకు ఇంగ్లండ్‌ తన టిక్కెట్‌ను ఖరారు చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..