రూ.641 కోట్లు సిద్ధం.. ఐపీఎల్ వేలంలో డబ్బుకు విలువే లేదుగా.. ఏటా ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?

IPL 2025 Mega Auction: సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. వీరిలో 366 మంది భారతీయులు, 208 మంది విదేశీయులు, ఇందులో ముగ్గురు అసోసియేట్ జట్ల ఆటగాళ్లు ఉన్నారు.

రూ.641 కోట్లు సిద్ధం.. ఐపీఎల్ వేలంలో డబ్బుకు విలువే లేదుగా.. ఏటా ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?
Ipl 2025 Mega Auction
Follow us
Venkata Chari

|

Updated on: Nov 19, 2024 | 10:13 AM

IPL 2025 Mega Auction: సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న IPL మెగా వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. వీరిలో 366 మంది భారతీయులు, 208 మంది విదేశీయులు, ఇందులో ముగ్గురు అసోసియేట్ జట్ల ఆటగాళ్లు ఉన్నారు. 330 మంది అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో 318 మంది భారతీయులు కాగా, 12 మంది విదేశీయులు. మొత్తం 204 స్లాట్‌లను భర్తీ చేయాల్సి ఉంది. వీటిలో 70 విదేశీ ఆటగాళ్లకు అందుబాటులో ఉన్నాయి. ఈసారి సౌదీలో ఆటగాళ్లపై భారీ కాసుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది.

కెప్టెన్ కోసం 5 జట్ల ఎదురుచూపులు..

ఈసారి వేలంలో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇది మరింత ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్‌లోని 5 జట్లకు ఒక కెప్టెన్ ఉండగా, 5 జట్లు వేలంలో కెప్టెన్‌ను చూస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్ లేరు.

వేలంలో ఎంత డబ్బు పెట్టనున్నరంటే?

ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో రూ.641 కోట్లు పణంగా పెట్టనున్నారు. 2022లో జరిగిన ఐపీఎల్ వేలంలో జట్లు అత్యధికంగా ఖర్చు చేశాయి. ఇక మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు రూ.551.7 కోట్లు వెచ్చించారు.

ఇవి కూడా చదవండి

2014- రూ. 262.6 కోట్లు

2015- రూ. 87.6 కోట్లు

2016- రూ. 136 కోట్లు

2017- రూ. 91 కోట్లు

2018- రూ. 431 కోట్లు

2019- రూ 106.8 కోట్లు

2020- రూ 140.3 కోట్లు

2021- రూ. 145.3 కోట్లు

2022- రూ. 551.7 కోట్లు

2023- రూ. 167 కోట్లు

2024- రూ. 230.45 కోట్లు

పంజాబ్‌లో అత్యధికంగా పర్స్ వాల్యూ..

పంజాబ్ కింగ్స్ వద్ద ఎక్కువ డబ్బు ఉంది. పంజాబ్ పర్సులో రూ.110.5 కోట్లు ఉన్నాయి. ఒక్కో జట్టు ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి లేదా రిటైన్ చేయడానికి మొత్తం రూ.120 కోట్లు కలిగి ఉంది. ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి ఇందులో కొంత భాగాన్ని వెచ్చించారు.

మెగా వేలంలో ఏ జట్టు పర్స్‌లో ఎంత డబ్బు ఉంటుందంటే?

పంజాబ్ కింగ్స్ – రూ. 110.5 కోట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 83 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 73 కోట్లు

గుజరాత్ టైటాన్స్ – రూ. 69 కోట్లు

లక్నో సూపర్ జెయింట్స్ – రూ. 69 కోట్లు

చెన్నై సూపర్ కింగ్స్ – రూ. 55 కోట్లు

ముంబై ఇండియన్స్ – రూ. 45 కోట్లు

కోల్ కతా నైట్ రైడర్స్ – రూ. 51 కోట్లు

సన్ రైజర్స్ హైదరాబాద్ – రూ. 45 కోట్లు

రాజస్థాన్ రాయల్స్ – రూ. 41 కోట్లు.

ఆటగాళ్లకు ఎన్ని స్లాట్లు అందుబాటులో ఉన్నాయి?

ప్రతి ఫ్రాంచైజీ జట్టు గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను కలిగి ఉండవచ్చు. జట్లలో కనీస ఆటగాళ్ల సంఖ్య 18. మొత్తం పది జట్లు ఉన్నాయి. కాబట్టి మొత్తం గరిష్టంగా 250 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. జట్లు ఇప్పటికే 46 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఐపీఎల్ వేలం సమయంలో గరిష్టంగా 204 స్లాట్‌లను భర్తీ చేయవచ్చు. ప్రతి జట్టు గరిష్టంగా ఎనిమిది మంది విదేశీ ఆటగాళ్లను కలిగి ఉంటుంది. కాబట్టి, వేలంలో విదేశీ ఆటగాళ్లకు 70 స్లాట్లు ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ.641 కోట్లు సిద్ధం.. ఐపీఎల్ వేలంలో డబ్బుకు విలువే లేదుగా
రూ.641 కోట్లు సిద్ధం.. ఐపీఎల్ వేలంలో డబ్బుకు విలువే లేదుగా
తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్..తెరిచి చూడగా
తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్..తెరిచి చూడగా
వచ్చే నెలలో పెళ్లి పీటలెక్కనున్న మహానటి..
వచ్చే నెలలో పెళ్లి పీటలెక్కనున్న మహానటి..
మెంటలెక్కిస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్‏..
మెంటలెక్కిస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్‏..
లారెన్స్ బిష్ణోయ్‌కి మరో షాక్..అతని సోదరుడు అరెస్ట్..అన్నాదమ్ములు
లారెన్స్ బిష్ణోయ్‌కి మరో షాక్..అతని సోదరుడు అరెస్ట్..అన్నాదమ్ములు
ఢిల్లీ టూ న్యూయార్క్.. 16 గంటలు కాదు.. అరగంట ప్రయాణమే..
ఢిల్లీ టూ న్యూయార్క్.. 16 గంటలు కాదు.. అరగంట ప్రయాణమే..
వామ్మో.. పోలీస్‌ క్వార్టర్స్‌లో దూరిన నాగుపాము హల్ చల్.. చివరకు
వామ్మో.. పోలీస్‌ క్వార్టర్స్‌లో దూరిన నాగుపాము హల్ చల్.. చివరకు
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త..అదేంటంటే..
వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త..అదేంటంటే..
ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది
ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది
గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీలో 6, తెలంగాణలో 4..
గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. ఏపీలో 6, తెలంగాణలో 4..