Watch: వామ్మో.. పోలీస్‌ క్వార్టర్స్‌లో దూరిన నాగుపాము హల్ చల్.. చివరకు ఏంజరిగిందంటే..

పోలీస్ క్వార్టర్స్ లో ఒక కానిస్టేబుల్ ఉంటున్న ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. కార్తీక మాసం వేళ నాగుపాము రావడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావించారు. గమనించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు

Watch: వామ్మో.. పోలీస్‌ క్వార్టర్స్‌లో దూరిన నాగుపాము హల్ చల్.. చివరకు ఏంజరిగిందంటే..
Snake
Follow us
J Y Nagi Reddy

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 19, 2024 | 9:22 AM

బాబోయ్‌ నాగుపాము.. ఏకంగా పోలీస్‌ క్వార్టర్స్‌లోకి దూరింది.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఓ కానిస్టేబుల్‌ ఇంట్లోకి దూరి ముప్పుతిప్పలు పెట్టింది. నంద్యాల జిల్లా మహానంది పోలీస్ క్వార్టర్స్ లో ఒక కానిస్టేబుల్ ఉంటున్న ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. కార్తీక మాసం వేళ నాగుపాము రావడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావించారు. గమనించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు. వెంటనే స్నేక్ క్యాచర్ వచ్చి చాకచక్యంగా దాన్ని బంధించి సంచిలో వేసుకున్నాడు.. అనంతరం ఆ నాగుపామును సమీపంలోని అడవిలో సురక్షితంగా వదిలిపెట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇంట్లోకి దూరిన నాగుపామును ఎట్టకేలకు బయటకు తరిమేయడంతో.. కానిస్టేబుల్ కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ నాగుపాము మాట వింటేనే, చూస్తేనే కుటుంబీకులు ఆందోళనకు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..