Viral Video: ఆలోచన ఉంటే అన్నీ సాధ్యమే.. ఆనంద్‌ మహీంద్ర ఇంట్రెస్టింగ్‌ వీడియో

మహీంద్ర గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర గురించి అందరికీ తెలిసిందే. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పోస్టుతో నెటిజన్లను ఆకట్టుకుంటారు ఆనంద్‌. ఈ నేపథ్యంలో తాజాగా ఎక్స్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్‌ చేశారు. ఇంతకీ వీడియోలో ఏముందనేగా..

Viral Video: ఆలోచన ఉంటే అన్నీ సాధ్యమే.. ఆనంద్‌ మహీంద్ర ఇంట్రెస్టింగ్‌ వీడియో
Anand Mahindra
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 19, 2024 | 6:55 AM

ఆనంద్‌ మహీంద్ర ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహీంద్ర గ్రూప్‌ ఛైర్మన్‌గా, గొప్ప పారిశ్రామికవేత్తగా ప్రపంచానికి పరిచయమున్న ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియా వేదికగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా యువతలో ఆనంద్‌ మహీంద్రకు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎన్నో అద్భుత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడం ఆయనకు అలవాటు.

ఇందులో ఎన్నో మోటివేషనల్‌ వీడియోలు కూడా ఉంటాయి. ఆసక్తికరంగా ఉండే వీడియోలను పంచుకునే ఆనంద్‌ మహీంద్ర.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియోను నెటిజన్లను షేర్‌ చేసుకున్నారు. మండే మోటివేషన్‌ పేరుతో ఈ వీడియోను పంచుకున్నారు మహీంద్ర. వివరాల్లోకి వెళితే.. ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన వీడియోలో మోటార్‌తో నడిచే ఓ చిన్న వాహనాన్ని రెండు బెంచ్‌ల మధ్య గుండా తీసుకెళ్తుంటారు.

ఇందుకోసం రెండు బెంచీల మధ్య బ్రిడ్జ్‌లాంటి నిర్మాణాలను చేపడతారు. అయితే మధ్యలోకి వెళ్లగానే ఆ వాహనం ఆగిపోతుంది. దీంతో దాని చక్రాల్లో చిన్న చిన్న మార్పులు చేసి మళ్లీ స్టార్ట్‌ చేస్తారు. దీంతో వాహనం ఈజీగా వెళ్లిపోతుంది. ఇలా సమస్య ఎదురైనా ప్రతీసారి ఒక మార్పు చేస్తూ వాహనాన్ని నడిపిస్తుంటారు. చివరికి దారంపై కూడా ఆ బొమ్మ వాహనం నడిచేలా మార్పులు చేస్తారు.

అక్కడున్న మార్గానికి అనుగుణంగా వాహనంలో మార్పులు చేర్పులు చేయడం వల్లే ప్రయాణం సాధ్యమైంది. ఇదిగో ఇదే పాయింట్‌ను మోటివేషన్‌గా మార్చారు ఆనంద్‌ మహీంద్ర. ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. మీలో క్రియేటివిటీ ఉంటే తప్పకుండా సాధించగలరు అనే క్యాప్షన్‌తో పాటు మండే మోటివేషన్‌ అనే ట్యాగ్‌ను జత చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ