Viral News: క్రిమినల్‌ ఆచూకీ చెప్పండి.. పోలీసుల పావలా రివార్డు అందుకోండి.. ఎక్కడంటే

ఈ సంఘటన నిజంగా ప్రత్యేకమైనది.. అదే సమయంలో హాస్యభరితమైనది. అయితే దీని వెనుక రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పోలీసుల వ్యూహం ప్రతిబింబిస్తుంది. ఒక నేరస్తుడిని పట్టుకుంటే 25 పైసలు రివార్డు ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం నేరస్థుడిని కించపరచడమే.. ఇదే తమ లక్ష్యం అని పోలీసులు చెబుతున్నారు.

Viral News: క్రిమినల్‌ ఆచూకీ చెప్పండి.. పోలీసుల పావలా రివార్డు అందుకోండి.. ఎక్కడంటే
Viral News
Follow us
Surya Kala

|

Updated on: Nov 18, 2024 | 8:45 PM

ఓ భయంకరమైన నేరస్థుడిని పట్టుకునేందుకు ఓ రాష్ట్రానికి చెందిన పోలీసులు సరికొత్త పధకాన్ని రచించారు. ప్రస్తుతం పోలీసుల చర్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నేరస్తుడిని పట్టుకుంటే పోలీసులు ఇచ్చే ప్రైజ్ మనీ వింటే షాక్ అవుతారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పోలీసులు తన సోషల్ మీడియా పోస్ట్‌లలో ఒక నేరస్థుడికి 25 పైసల రివార్డ్‌ను పెట్టారు. ఇది నిజం.. భరత్‌పూర్ పోలీసుల పెట్టిన ఈ పోస్ట్‌పై ఫన్నీ కామెంట్‌ల వర్షం కురుస్తోంది. ఈ నేరస్తుడు మీరు పెట్టిన ఈ రివార్డ్ మనీ గురించి తెలిస్తే.. ఆ బాధను భరించలేక లొంగిపోతాడని ప్రజలు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

నవంబర్ 15న @BharatpurPolice హ్యాండిల్‌తో భరత్‌పూర్ పోలీసులు ఒక ట్వీట్ చేసారు. ఇది ప్రస్తుతం ముఖ్యాంశాలలో ఒక భాగమైంది. వాస్తవానికి భరత్‌పూర్‌లోని లఖన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఖుబీరామ్ జాట్ అనే వ్యక్తిపై అనేక తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. మై నివాసి ఖుబీరామ్ ఫోటోను పోలీసులు సోషల్ మీడియాలో విడుదల చే.. ఈ వ్యక్తి జాడని తెలియజేయమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఇతడిని పట్టించిన వారికి 25 పైసలు రికార్డ్ ని అందించనున్నామని వెల్లడించారు. ఈ ప్రైజ్ మనీ చూసి జనాలు ఆలోచనలో పడ్డారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

ఈ సంఘటనకు నిజంగా ప్రజల్లో ఓ రేంజ్ లో స్పందన వచ్చింది. దీని వెనుక భరత్‌పూర్ పోలీసుల వ్యూహం ప్రతిబింబిస్తుంది. 25 పైసలు రివార్డు ప్రకటించిన భరత్‌పూర్ పోలీసుల సోషల్ మీడియా పోస్ట్ ను లక్షలాది మంది వీక్షించారు. అదే సమయంలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ 25 పైసల రివార్డ్ నగదు రూపంలో ఇవ్వబడుతుందా లేదా చెక్కు రూపంలో ఇవ్వబడుతుందా అని ఒకరు చమత్కరించారు. మరోకరు మాట్లాడుతూ ఈ నిందితుడి అనుచరులు కూడా మీపై పోలీసులు ఎంత రివార్డు ప్రకటించారు అని అడగలేరని కామెంట్ చేశారు. మరొకరు రివార్డ్ ను అందుకున్న వారి ఇంటిపై ED దాడులు చేస్తారా అని కామెంట్ చేయగా.. ఇంకొకరు రివార్డ్ డబ్బును చూసిన తర్వాత.. ఈ నిందుతుడు లొంగిపోతాడు లేదా ఆత్మహత్య చేసుకుంటాడా అంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..