AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pineapple: ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా.. ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా అనాస తినొద్దు ఎందుకంటే..

అనాస పండులో విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాపర్, డైటరీ ఫైబర్ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పైనాపిల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొందరు దీనిని తినడానికి ఇష్టపడరు.. అదే సమయంలో ఈ సమస్య ఉన్నవారు తినకూడదు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Pineapple: ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా.. ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా అనాస తినొద్దు ఎందుకంటే..
Pineapple Side Effects
Surya Kala
|

Updated on: Nov 18, 2024 | 8:24 PM

Share

అనాస పండులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. తీపిగా, పుల్లగా ఉండే అనాస పండు రుచిని చాలా మంది ఇష్టపడతారు. అలాగే దీనిలో విటమిన్ సి కి అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది. పైనాపిల్‌లోని బ్రోమెలైన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఈ ఉష్ణమండల పండు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. అయినప్పటికీ అనాస పండుని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, వికారం వంటి అనేక లక్షణాలు కనిపించవచ్చు. పర్డ్యూ యూనివర్శిటీ ఉద్యానవన విభాగం ప్రకారం విటమిన్ సి అధికంగా ఉండే అనాస పండ్లు పండకుండా తినకూడదు. ఎందుకంటే పండని పండుని తింటే తీవ్రమైన విరేచనాలు, వాంతుల బారిన పడవచ్చు.

  1. మధుమేహం: పైనాపిల్‌లో సహజ చక్కెరలు, కేలరీలు అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుంది.
  2. కడుపు సంబంధిత సమస్యలు: పైనాపిల్ తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్ లేదా ఎసిడిటీ సమస్యలు ఉన్నవారికి ఈ సమస్యలు మరింత వస్తాయి. పైనాపిల్ తీసుకోవడం ద్వారా వీరి సమస్యలు తీవ్రమవుతాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో పొరపాటున కూడా అనాస పండు తినొద్దు.
  3. కిడ్నీ వ్యాధి: రోజుకు విటమిన్ సి గరిష్ట పరిమితి 200 మి.గ్రా. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం హానికరం. కనుక కిడ్నీలు పాడవకుండా కాపాడుకోవాలంటే అనాస పండు మితంగా తీసుకోవడం మంచిది.
  4. పైనాపిల్ లోని ఆమ్లత్వం ఫలితంగా చిగుళ్ళు, దంత ఎనామెల్ క్షీణించవచ్చు. అంతేకాదు ఇది నోటి కావిటీస్, చిగురువాపుకు దారితీయవచ్చు.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇక్కడ ఉన్న విషయాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.