AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs DC IPL 2026 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. తుది జట్ల ప్లేయింగ్ 11 ఇదే

RR vs DC IPL 2026 : ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా టేబుల్ టాపర్‌గా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలతో 7వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.

RR vs DC IPL 2026 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. తుది జట్ల ప్లేయింగ్ 11 ఇదే
Rr Vs Dc
Rakesh
|

Updated on: May 01, 2026 | 7:24 PM

Share

RR vs DC IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. టోర్నమెంట్‌లో భాగంగా నేడు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో 43వ రసవత్తర పోరు ప్రారంభమైంది. రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి ఏమాత్రం తడబడకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సొంత గడ్డపై భారీ స్కోరు సాధించి ఢిల్లీని ఒత్తిడిలోకి నెట్టాలన్నది రాజస్థాన్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఇప్పటికే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రాజస్థాన్, ఈ మ్యాచ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన జట్టుపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. రాజస్థాన్ జట్టులో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు. వికెట్ కీపర్ ధృవ్‌ జురెల్‌, డోనోవన్‌ ఫెరీరా, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు జట్టుకు బలంగా మారారు. బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నండ్రే బర్గర్ ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, కెప్టెన్ అక్షర్ పటేల్ కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడుతుండగా, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టి. నటరాజన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ, గత కొన్ని మ్యాచ్‌లుగా ఢిల్లీ ప్రదర్శన ఆశాజనకంగా లేదు. గత మ్యాచ్‌లో కేవలం 75 పరుగులకే ఆలౌట్ కావడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా టేబుల్ టాపర్‌గా నిలిచే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలతో 7వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఢిల్లీకి నేటి విజయం చాలా కీలకం.

నేటి మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణ 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య జరిగే పోరు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్, కుల్దీప్ మాయాజాలాన్ని ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రెండు సెంచరీలు బాదిన వైభవ్, నేడు కూడా అదే జోరును కొనసాగిస్తే ఢిల్లీకి కష్టాలు తప్పవు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us