AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RR vs CSK: ధోనీతో సహా ముగ్గురు స్టార్స్ దూరం.. ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి ఇలా..!

Rajasthan Royals vs Chennai Super Kings, 3rd Match, Indian Premier League 2026: ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. అయితే, ఈ పోరుకు ముందే సీఎస్‌కేకు భారీ షాక్ తగిలింది. ఎంఎస్ ధోనీతో పాటు మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ఐపీఎల్ చరిత్రలో ముందెన్నడూ జరగని ఒక వింత సంఘటన ఈ మ్యాచ్‌తో నమోదు కానుంది.

RR vs CSK: ధోనీతో సహా ముగ్గురు స్టార్స్ దూరం.. ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి ఇలా..!
Rajasthan Royals Vs Chennai Super Kings
Venkata Chari
|

Updated on: Mar 30, 2026 | 3:09 PM

Share

Rajasthan Royals vs Chennai Super Kings: రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్ ‘వండర్ బాయ్’ వైభవ్ సూర్యవంశీ మెరుపులు, తన పాత జట్టుపై రవీంద్ర జడేజా పోరాటం చూడాలని అందరూ భావిస్తున్నారు. కానీ, మ్యాచ్ ప్రారంభానికి ముందే ముగ్గురు ఆటగాళ్లు ప్లేయింగ్ ఎలెవన్ నుంచి వైదొలగడం గమనార్హం. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలవాలంటే చెన్నై టీంతోపాటు రాజస్థాన్ కూడా తీవ్రంగా కష్టపడాల్సి రావొచ్చు.

1. ఎంఎస్ ధోనీ (MS Dhoni): సీఎస్‌కే వెటరన్ స్టార్ ధోనీ గాయం కారణంగా కొన్ని వారాల పాటు ఆటకు దూరమయ్యాడు. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఒక రోజు ముందే తన గాయం గురించి ధోనీ అప్‌డేట్ ఇచ్చాడు. ఆయన జట్టుతో కలిసి ప్రయాణించినా, మైదానంలోకి మాత్రం దిగడం లేదు.

2. డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis): ‘బేబీ ఏబీ’గా పేరుగాంచిన బ్రెవిస్ సైడ్ స్ట్రెయిన్ గాయంతో బాధపడుతున్నాడు. నివేదికల ప్రకారం, ఆయన కనీసం మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు.

3. స్పెన్సర్ జాన్సన్ (Spencer Johnson): నాథన్ ఎల్లిస్ స్థానంలో సీఎస్‌కేలోకి వచ్చిన ఈ ఆస్ట్రేలియా పేసర్ కూడా గాయపడినట్లు సమాచారం. ఆయన ఇంకా జట్టుతో కూడా చేరలేదు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆయన ఆడటం అసాధ్యం.

ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి..!

గువహటి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఒక అరుదైన రికార్డుకు వేదిక కానుంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా లేదా రవీంద్ర జడేజా.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కచ్చితంగా మైదానంలో ఉండేవారు. కానీ, ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఈ ముగ్గురు దిగ్గజాలు లేకుండానే సీఎస్‌కే బరిలోకి దిగబోతోంది. ఇది ఆ జట్టు అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే.

సవాల్‌గా మారిన జట్టు కూర్పు..

స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు జట్టు ఎంపిక కత్తిమీద సాములా మారింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టులో శాంసన్, సూర్యవంశీ వంటి ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం సీఎస్‌కేకు సవాల్‌గా మారనుంది. సామ్ కరన్ వంటి ప్లేయర్లు కూడా దూరమవ్వడం రాజస్థాన్‌కు లోటే అయినప్పటికీ, సీఎస్‌కేతో పోలిస్తే వారి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో డిఫెండింగ్ ఛాంపియన్లు ఎలా రాణిస్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us