AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

కొంతకాలంగా రికార్డు స్థాయిలతో సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఇటీవల బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. వాస్తవానికి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. ప్రతిరోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే..

Gold Price: తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
Gold Price
Shaik Madar Saheb
|

Updated on: Jul 15, 2026 | 6:30 AM

Share

కొంతకాలంగా రికార్డు స్థాయిలతో సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో ఇటీవల బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. వాస్తవానికి అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. ప్రతిరోజు బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే.. అయితే.. ఇరాన్ – అమెరికా యుద్ధం, అలాగే పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరలు ఇటీవల రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది. సోమవారం భారీగా తగ్గిన బంగారం ధరలు, మంగళవారం కూడా స్వల్పంగా తగ్గాయి.. బుధవారం జులై 15, పలు వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర తగ్గి.. రూ.1,42,790 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర తగ్గి.. రూ.1,30,890 గా ఉంది.

వెండి కిలో ధర రూ.2,34,900 లు గా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,30,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,42,790, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,30,890 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,42,940, 22 క్యారెట్ల ధర రూ.1,31,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,42,790, 22 క్యారెట్ల ధర రూ.1,30,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.143,450, 22 క్యారెట్ల ధర రూ.1,31,490 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,790, 22 క్యారెట్ల ధర రూ.1,30,890 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us