IND vs SL T20Is Stats: భారత్, శ్రీలంక టీ20 సిరీస్‌లో ఆధిపత్యం వీరిదే.. టాప్5లో 4గురు మనోళ్లే..

జనవరి 3 నుంచి భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేశాడు.

IND vs SL T20Is Stats: భారత్, శ్రీలంక టీ20 సిరీస్‌లో ఆధిపత్యం వీరిదే.. టాప్5లో 4గురు మనోళ్లే..
Team India
Follow us

|

Updated on: Dec 30, 2022 | 7:10 AM

జనవరి 3 నుంచి భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ అత్యధిక పరుగులు చేశాడు. ఈ లిస్టులో ఎంతమంది ప్లేయర్లు ఉన్నారో ఇప్పుడ చూద్దాం. భారత్-శ్రీలంక మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ 19 మ్యాచ్‌ల్లో 24.17 సగటుతో 144.21 స్ట్రైక్ రేట్‌తో 411 పరుగులు చేశాడు.

భారత్-శ్రీలంక టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు శిఖర్ ధావన్. ధావన్ 12 మ్యాచ్‌ల్లో 37.50 సగటుతో 129.31 స్ట్రైక్ రేట్‌తో 375 పరుగులు చేశాడు.

ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. 8 టీ20 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 67.80 సగటుతో 138.36 స్ట్రైక్ రేట్‌తో 339 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ టాప్-5 జాబితాలో ఉన్న ఏకైక శ్రీలంక బ్యాట్స్‌మెన్ దసున్ షనక. భారత్‌పై 19 టీ20 మ్యాచ్‌లు ఆడిన షనక 306 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాటింగ్ సగటు 25.50, స్ట్రైక్ రేట్ 128.03గా నిలిచింది.

ఈ లిస్టులో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన 9 టీ20 మ్యాచ్‌ల్లో రాహుల్ 37.62 సగటుతో 139.35 స్ట్రైక్ రేట్‌తో 301 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..