AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్ల హవా.. టాప్-5లో ఏకంగా ముగ్గురు.. ఎవరెవరంటే?

ఐసీసీ ఈరోజు విడుదల చేసిన కొత్త వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల విజయాల జోరు కొనసాగుతోంది. వన్డే ప్రపంచకప్ తర్వాత ఏ వన్డే సిరీస్ ఆడనప్పటికీ, టీమ్ ఇండియా ఆటగాళ్లు ఈ వన్డే ర్యాంకింగ్స్‌ టాప్ లో కనిపించడం విశేషం. కొత్త ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ ఆజం యధావిధిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు

ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్ల హవా.. టాప్-5లో ఏకంగా ముగ్గురు.. ఎవరెవరంటే?
Team India
Basha Shek
|

Updated on: Mar 20, 2024 | 8:23 PM

Share

ఐసీసీ ఈరోజు విడుదల చేసిన కొత్త వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్ల విజయాల జోరు కొనసాగుతోంది. వన్డే ప్రపంచకప్ తర్వాత ఏ వన్డే సిరీస్ ఆడనప్పటికీ, టీమ్ ఇండియా ఆటగాళ్లు ఈ వన్డే ర్యాంకింగ్స్‌ టాప్ లో కనిపించడం విశేషం. కొత్త ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ ఆజం యధావిధిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 824 రేటింగ్ పాయింట్లతో ఉన్న బాబర్ మరికొంత కాలం అగ్రస్థానంలో కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే బాబర్ కు బలమైన పోటీదారుగా ఉన్న టీమ్ ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న గిల్ 801 రేటింగ్‌ పాయింట్లతో ఉన్నాడు. గిల్ తర్వాతి స్థానంలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ కూడా ఒక్క వన్డే ఆడలేదు. అయినప్పటికీ. 768 రేటింగ్‌తో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. గత ర్యాంకింగ్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకాడు. 764 రేటింగ్‌తో ఉన్న రోహిత్ ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయితే ఐర్లాండ్ క్రికెటర్ హ్యారీ టెక్టర్ పేలవ ప్రదర్శన రోహిత్ కు లాభించింది.

ఇంతకుముందు హ్యారీ టెక్టర్ నాలుగో స్థానంలో ఉండగా, ఇప్పుడు అతను 746 రేటింగ్‌తో రోహిత్ శర్మతో సరిపెట్టుకున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ 728 రేటింగ్‌తో ఆరో స్థానంలో ఉండగా, డేవిడ్ వార్నర్ 723 రేటింగ్‌తో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇతర ప్లేయర్ల విషయానికి వస్తే.. శ్రీలంకకు చెందిన పాతుమ్ నిస్సాంక మూడు స్థానాలు ఎగబాకి ఇప్పుడు టాప్ 10లోకి ప్రవేశించాడు. ఇంగ్లండ్‌ ఆటగాడు డేవిడ్‌ మలన్‌ ఒక స్థానం దిగజారి తొమ్మిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 701 రేటింగ్‌తో పదో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us