AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: 24 కోట్ల స్టార్ బౌలర్‌కు చుక్కలు చూపించిన రింకూ.. ఐపీఎల్‌కు ముందే ధనాధన్ ఇన్నింగ్స్.. వీడియో

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నాయి . అన్ని జట్లు కష్టపడి సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మార్చి 22న చెన్నై, ఆర్‌సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కంటే ముందే టీమిండియా యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ సంచలనం సృష్టించించాడు

IPL 2024: 24 కోట్ల స్టార్ బౌలర్‌కు చుక్కలు చూపించిన రింకూ.. ఐపీఎల్‌కు ముందే ధనాధన్ ఇన్నింగ్స్.. వీడియో
Rinku Singh
Basha Shek
|

Updated on: Mar 20, 2024 | 6:51 PM

Share

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నాయి . అన్ని జట్లు కష్టపడి సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. మార్చి 22న చెన్నై, ఆర్‌సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కంటే ముందే టీమిండియా యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ సంచలనం సృష్టించించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయరైన (24.75 కోట్లు) మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇది జరగ్గా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఐపీఎల్ సన్నాహకాల్లో భాగంగా.. కేకేఆర్ టీమ్‌ పర్పుల్‌, టీమ్‌ గోల్డ్‌గా విడిపోయి ప్రాక్టీస్ చేశాయి. కేకేఆర్‌ ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో జరిగిన ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్ లో పర్పుల్‌కు స్టార్క్‌ సారథ్యం వహించగా.. టీమ్‌ గోల్డ్‌లో ఉన్న రింకూ సింగ్‌ అతడికి పట్ట పగలే చుక్కలు చూపించాడు. ముఖ్యంగా స్టార్క్ వేసిన ఓ ఫుల్ టాస్ బంతిని భారీ సిక్సర్ బాదాడు రింకూ. రింకూ ధాటికి బంతి నేరుగా స్క్వేర్ లెగ్‌ దిశలో స్టేడియంలోకి వెళ్లి పడింది. ఈ మ్యాచ్ లో రింకూ సింగ్‌ 16 బంతుల్లోనే 37 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మరోవైపు స్టార్క్ 4 ఓవర్లు వేసి ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు. కేవలం ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. కాగా ఐపీఎల్‌లో రింకూ ధర కేవలం రూ. 55 లక్షలు మాత్రమే.

వన్డే వరల్డ్‌కప్‌-2023లో సత్తాచాటిన మిచెల్‌ స్టార్క్‌ కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు పెట్టింది కోల్ కతా నైట్ రైడర్స్. అతను దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లో పునరాగమనం చేయనున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్:

నితీష్ రాణా, రింకూ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జాసన్ రాయ్, సునీల్ నరైన్, సుయేష్ శర్మ, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ చరోరతి, వైభవ్ చరోరతి భరత్, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, గుస్ అట్కిన్సన్, సాకిబ్ హుస్సేన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us