AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినేష్ ఫోగాట్‌పై వేటు.. యశస్వి జైస్వాల్‌కు కూడా నోటీసులు.. అసలేం జరిగిందంటే?

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. క్రమశిక్షణారాహిత్యం, డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) ఆమెపై తాత్కాలిక నిషేధం విధించింది. దీంతో ఆమె రీఎంట్రీ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇదే సమయంలో క్రికెటర్ యశస్వి జైస్వాల్‌కు కూడా నోటీసులు అందడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వినేష్ ఫోగాట్‌పై వేటు.. యశస్వి జైస్వాల్‌కు కూడా నోటీసులు.. అసలేం జరిగిందంటే?
Vinesh Phogat Wfi Ban Yashasvi Jaiswal
Venkata Chari
|

Updated on: May 09, 2026 | 6:55 PM

Share

సీనియర్ రెజ్లర్ వినేష్ ఫోగాట్‌పై భారత రెజ్లింగ్ సమాఖ్య కఠిన చర్యలు తీసుకుంది. గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించి, మళ్ళీ పోటీల్లోకి రావాలని నిర్ణయించుకున్న వినేష్‌కు షాక్ ఇస్తూ జూన్ 26, 2026 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. సుమారు 18 నెలల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని గొండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌తో ఆమె పునరాగమనం చేయాల్సి ఉంది. కానీ ఈ తాజా నిషేధంతో ఆమె ఆ టోర్నీకి దూరమైంది.

సమాఖ్య మోపిన తీవ్ర ఆరోపణలు..

వినేష్ ఫోగాట్‌కు పంపిన 15 పేజీల నోటీసులో రెజ్లింగ్ సమాఖ్య ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. అంతర్జాతీయ వేదికలపై ఆమె ప్రవర్తన దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని, తద్వారా భారత రెజ్లింగ్ రంగానికి నష్టం చేకూరిందని సమాఖ్య పేర్కొంది. ముఖ్యంగా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బరువు తగ్గడంలో వైఫల్యం చెంది అనర్హతకు గురవ్వడం, డోపింగ్ నిరోధక నిబంధనల ప్రకారం తన చిరునామా సమాచారాన్ని (వేర్ అబౌట్స్) అందించడంలో విఫలమవ్వడం వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. వీటిపై 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సమాఖ్య ఆమెను ఆదేశించింది.

క్రికెటర్లకు నాడా షాక్..

కేవలం రెజ్లింగ్ మాత్రమే కాకుండా, క్రికెట్ రంగంలో కూడా డోపింగ్ నిరోధక నిబంధనల ఉల్లంఘన ప్రకంపనలు సృష్టిస్తోంది. టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, మహిళా క్రికెటర్ షఫాలీ వర్మలకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) నోటీసులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో పరీక్షల కోసం అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీనిని ‘వేర్ అబౌట్స్’ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని వారిని కోరారు.

ప్రమాదంలో ఆటగాళ్ల భవిష్యత్తు..

క్రీడాకారులు ఎక్కడ ఉన్నారో అధికారులకు ముందే సమాచారం ఇవ్వడం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం తప్పనిసరి. ఇలా వరుసగా మూడు సార్లు విఫలమైతే వారిపై నిషేధం విధించే అవకాశం ఉంటుంది. వినేష్ ఫోగాట్ గతంలో నిరసనల్లో కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు సాంకేతిక కారణాలతో ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది. క్రికెటర్ల విషయంలో కూడా ఇదే జరిగితే జట్టు కూర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలు భారత క్రీడారంగంలో నిబంధనల అమలు ఎంత కఠినంగా ఉందో తెలియజేస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
అలాంటి వారు జీవితంలోకి వస్తే ప్రేమ నిలబడదు
అలాంటి వారు జీవితంలోకి వస్తే ప్రేమ నిలబడదు
ఎండిపోయి చనిపోతున్న మొక్కను కూడా బ్రతికించే సంజీవిని..
ఎండిపోయి చనిపోతున్న మొక్కను కూడా బ్రతికించే సంజీవిని..
అమావాస్య తర్వాత అదృష్టం పట్టే రాశులివే.. వీరికి ఇక లక్కే లక్కు!
అమావాస్య తర్వాత అదృష్టం పట్టే రాశులివే.. వీరికి ఇక లక్కే లక్కు!
వాస్తు టిప్ప్: ఇంట్లో కరెంట్ మీటర్ ఈ దిశలో ప్రమాదం మీ వెన్నంటే!
వాస్తు టిప్ప్: ఇంట్లో కరెంట్ మీటర్ ఈ దిశలో ప్రమాదం మీ వెన్నంటే!
ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా?
ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా?
అల్లం మురబ్బా.. సర్వరోగాలకు దివ్యౌషధం.. సింపుల్‌గా ఇలా చేసుకోండి
అల్లం మురబ్బా.. సర్వరోగాలకు దివ్యౌషధం.. సింపుల్‌గా ఇలా చేసుకోండి
పాస్టర్‌ ముసుగులో పాపాత్ముడు.. నమ్మి ఇంట్లోకి రానిస్తే..
పాస్టర్‌ ముసుగులో పాపాత్ముడు.. నమ్మి ఇంట్లోకి రానిస్తే..
వినేష్ ఫోగాట్‌పై వేటు.. యశస్వి జైస్వాల్‌కు కూడా నోటీసులు?
వినేష్ ఫోగాట్‌పై వేటు.. యశస్వి జైస్వాల్‌కు కూడా నోటీసులు?
కక్ష తీర్చుకున్న ప్రియురాలు.. ప్రియుడి మర్మాంగం కట్!
కక్ష తీర్చుకున్న ప్రియురాలు.. ప్రియుడి మర్మాంగం కట్!
ఈ రాశుల వారికి ధన వర్షం.. ఆదాయం డబుల్ అయ్యే ఛాన్స్!
ఈ రాశుల వారికి ధన వర్షం.. ఆదాయం డబుల్ అయ్యే ఛాన్స్!