AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జింబాబ్వే గడ్డపై విధ్వంసానికి బుడ్డోడు రెడీ.. కట్‌చేస్తే.. 300 రోజుల నాటి రికార్డ్ బ్రేక్ చేసే లక్కీ ఛాన్స్..!

Vaibhav Sooryavanshi Fastest T20I Century Record: సొంత ప్రతిభతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్ ఎంతో కీలకం. మొదటి మ్యాచ్‌లోనే ఈ చారిత్రక రికార్డును బద్దలు కొట్టి, జట్టుకు ఘనవిజయాన్ని అందిస్తే భారత టీ20 భవిష్యత్తుకు ఆయన బలమైన పునాది వేసినట్లే అవుతుంది.

జింబాబ్వే గడ్డపై విధ్వంసానికి బుడ్డోడు రెడీ.. కట్‌చేస్తే.. 300 రోజుల నాటి రికార్డ్ బ్రేక్ చేసే లక్కీ ఛాన్స్..!
Vaibhav Sooryavanshi Fastest T20i Century Record
Venkata Chari
|

Updated on: Jul 21, 2026 | 7:32 PM

Share

Vaibhav Sooryavanshi Fastest T20I Century Record: భారత్, జింబాబ్వే మధ్య జులై 23 నుంచి ప్రారంభం కానున్న టీ20 సమరానికి హరారే నగరం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఇంగ్లాండ్ పర్యటనలో చవిచూసిన వైఫల్యాన్ని మర్చిపోయి, జింబాబ్వే గడ్డపై అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డును బద్దలు కొట్టేందుకు ఈ యువ తుఫాన్ సిద్ధమవుతున్నాడు.

హరారేలో వైభవ్ సూర్యవంశీని వెంటాడుతోన్న చారిత్రక మైలురాయి..!

ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన వైభవ్, ఇప్పుడు జింబాబ్వేపై తన సత్తా చాటేందుకు ఆరాటపడుతున్నాడు. జులై 23న ఆయన తొలి టీ20 ఆడటానికి మైదానంలోకి దిగేనాటికి, జింబాబ్వే నేలపై నమోదైన అత్యంత వేగవంతమైన అంతర్జాతీయ టీ20 సెంచరీ రికార్డు పూర్తయి సరిగ్గా 300 రోజులు కావడం విశేషం.

ఇదికూడా చదవండి: ఆల్‌రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి.. భారత్ కొంపముంచుతోన్న గంభీర్ మొండి పట్టుదల

ఇవి కూడా చదవండి

ఈ ప్రత్యేకమైన రోజున పాత రికార్డును తిరగరాసి సరికొత్త చరిత్ర సృష్టించే సువర్ణావకాశం ఈ యువ ఎడమచేతి వాటం బ్యాటర్‌కు లభించింది. తన సహజసిద్ధమైన దూకుడుతో పరుగుల వర్షం కురిపిస్తే, ఈ రికార్డు వైభవ్ సొంతం కావడం ఏమంత కష్టం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

జింబాబ్వేలో వేగవంతమైన శతకం ఎవరి పేరిట ఉందో తెలుసా..?

ప్రస్తుతం జింబాబ్వే గడ్డపై అతి తక్కువ బంతుల్లో టీ20 సెంచరీ చేసిన రికార్డు నమీబియా ఆటగాడు జేజే స్మిత్ పేరిట ఉంది. 2025 సెప్టెంబర్ 26న కెన్యాపై జరిగిన మ్యాచ్‌లో ఆయన కేవలం 37 బంతుల్లోనే శతకం బాది చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో 39 బంతుల్లో 7 సిక్సర్లు, 12 ఫోర్లతో నాటౌట్‌గా 111 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను చెండాడాడు.

స్మిత్ సృష్టించిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా నమీబియా నిర్ణీత ఓవర్లలో 241 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన కెన్యా 105 పరుగులకే పరిమితమై 136 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

అభిషేక్ శర్మ రికార్డును చెరిపేసిన జేజే స్మిత్..!

అంతకుముందు జింబాబ్వేలో వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డు భారత విస్ఫోటక ఓపెనర్ అభిషేక్ శర్మ పేరిట ఉండేది. 2024 జింబాబ్వే పర్యటనలో అభిషేక్ 46 బంతుల్లో శతకం బాదగా, ఆ రికార్డును జేజే స్మిత్ 37 బంతుల్లోనే అధిగమించాడు.

ఇదికూడా చదవండి: టీమిండియా పరువు తీశారుగా.. ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!

అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీల్లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదిన అనుభవం వైభవ్ సూర్యవంశీకి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా అదే తరహా విధ్వంసం సృష్టిస్తే, జింబాబ్వేలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ చరిత్ర పుటల్లోకి ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us