AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup 2027: ఐసీసీ సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్?

ODI World Cup 2027, Cut-Off Date For Direct Qualification: ప్రపంచకప్‌లో నేరుగా చోటు సంపాదించాలంటే ప్రతి వన్డే సిరీస్ కూడా జట్లకు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా మారింది. మరి ఐసీసీ విధించిన కటాఫ్ గడువులోగా వెస్టిండీస్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకుని ప్రపంచకప్‌కు నేరుగా చేరుకుంటుందో లేదో వేచి చూడాలి.

ODI World Cup 2027: ఐసీసీ సంచలన నిర్ణయం.. వరల్డ్ కప్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్?
Odi World Cup 2027, Cut Off Date For Direct Qualification
Venkata Chari
|

Updated on: Jul 21, 2026 | 8:46 PM

Share

ODI World Cup 2027, Cut-Off Date For Direct Qualification: వన్డే ప్రపంచకప్ 2027 అర్హతలకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అత్యంత కీలక ప్రకటన చేసింది. నేరుగా అర్హత సాధించే జట్లను నిర్ణయించడానికి కటాఫ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్‌తో పాటు పలు ప్రముఖ జట్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..!

ప్రపంచకప్ అర్హత మార్గాలను స్పష్టం చేసిన ఐసీసీ..

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల సంయుక్త ఆతిథ్యంలో 2027లో జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ మహా సంగ్రామంలో ఆతిథ్య దేశాలుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నేరుగా అర్హత సాధించగా, నమీబియా మాత్రం ప్రాంతీయ క్వాలిఫైయర్ టోర్నీ ద్వారా రావాల్సి ఉంటుంది.

ఇదికూడా చదవండి: టీమిండియా పరువు తీశారుగా.. ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!

ఇవి కూడా చదవండి

మిగిలిన స్థానాల కోసం జట్లను ఎంపిక చేసేందుకు ఐసీసీ ఒక ప్రత్యేకమైన కటాఫ్ తేదీని నిర్ణయించింది. అధికారిక వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా అర్హత పొందే జట్లను ఈ తేదీ నాటికి ఉన్న పాయింట్ల ఆధారంగానే ఖరారు చేయనున్నారు.

వెస్టిండీస్ ఆశలకు గండి పడేనా..?

గతంలో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేక తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్న కారీబియన్ జట్టు వెస్టిండీస్‌కు ఇప్పుడు మళ్లీ అదే రకమైన ముప్పు పొంచి ఉంది. ఐసీసీ ప్రకటించిన కటాఫ్ గడువు ముగిసే సమయానికి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాల్లో నిలవడం వెస్టిండీస్‌కు ఎంతో కీలకంగా మారింది.

ర్యాంకింగ్స్‌లో వెనుకబడితే, కరేబియన్ టీం మరోసారి అర్హత టోర్నీ (క్వాలిఫైయర్స్) ఆడాల్సి వస్తుంది. గడిచిన కొద్దికాలంగా వన్డే ఫార్మాట్‌లో నిలకడలేని ప్రదర్శన చేస్తున్న వెస్టిండీస్‌కు ఇది నిజంగానే పెద్ద సవాలు అని చెప్పాలి.

గ్లోబల్ క్వాలిఫైయర్ పోరు మరింత కఠినం..

ఐసీసీ నిబంధనల ప్రకారం కటాఫ్ తేదీ నాటికి ర్యాంకింగ్స్‌లో మొదటి వరుసలో నిలిచే ప్రధాన జట్లు నేరుగా ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి. అయితే, మిగిలిన స్థానాల కోసం క్వాలిఫైయర్ టోర్నీ నిర్వహిస్తారు.

ఇదికూడా చదవండి: ఆల్‌రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి.. భారత్ కొంపముంచుతోన్న గంభీర్ మొండి పట్టుదల

ఈ క్వాలిఫైయర్ మ్యాచ్‌లలో అసోసియేట్ దేశాల నుంచి వచ్చే జట్లు కూడా హోరాహోరీగా తలపడనున్నాయి. దీంతో చిన్న జట్ల చేతిలో ఏమాత్రం పొరపాటు జరిగినా పెద్ద జట్లకు ప్రపంచకప్ తలరాత మారిపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us