AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: తెలుగోడికి లక్కీ ఛాన్స్.. బుమ్రా, జడేజా రీఎంట్రీ.. లంకను ఢీ కొట్టే భారత జట్టు ఇదే..!

India vs Sri Lanka Test Series 2026: సొంతగడ్డపై ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత జట్టు, శ్రీలంకను వారి సొంత మైదానాల్లోనే దెబ్బకొట్టాలని చూస్తోంది. విరామం తర్వాత బుమ్రా, జడేజాల రాక జట్టు బలాన్ని రెట్టింపు చేసింది. రాబోయే వారం రోజుల్లో బీసీసీఐ అధికారికంగా ఈ ప్రకటన విడుదల చేయనుంది.

IND vs SL: తెలుగోడికి లక్కీ ఛాన్స్.. బుమ్రా, జడేజా రీఎంట్రీ.. లంకను ఢీ కొట్టే భారత జట్టు ఇదే..!
India Vs Sri Lanka Test Series 2026
Venkata Chari
|

Updated on: Jul 21, 2026 | 6:45 PM

Share

India vs Sri Lanka Test Series 2026: ఐపీఎల్ ముగిసినప్పటి నుంచి వరుస వన్డేలు, టీ20 మ్యాచ్‌లతో బిజీగా గడిపిన భారత క్రికెట్ జట్టు, త్వరలోనే సంప్రదాయ టెస్టు సమరానికి సిద్ధమవుతోంది. వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ వారంలోనే ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. జట్టులోకి కీలక సీనియర్లు తిరిగి రానుండటంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

సీనియర్ల రీఎంట్రీ.. తుది జట్టు ఎంపికపై కసరత్తు..!

శ్రీలంకతో జరగబోయే కీలకమైన టెస్టు పోరు కోసం సీనియర్ వేగపంథ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు మళ్లీ జట్టులోకి అడుగుపెడుతుండటం ఎంతో ఊరటనిచ్చే అంశం. వీరితో పాటు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ల ఎంపిక కూడా దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

ఇదికూడా చదవండి: టీమిండియా పరువు తీశారుగా.. ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!

ఇవి కూడా చదవండి

అయితే, తీవ్ర గాయం కారణంగా ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఈ టెస్టు సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. మరోవైపు గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తెలుగు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తిరిగి భారత స్క్వాడ్‌లో చోటు దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.

సొంతగడ్డపై ఎదురైన పరాభవాలు.. లంకపై గెలుపే లక్ష్యం..!

శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో అనూహ్యంగా టెస్టు సిరీస్‌లను కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారీ విజయం సాధించినప్పటికీ, ఆ ఓటముల భారం జట్టును వెంటాడుతోంది.

ఇదికూడా చదవండి: ఆల్‌రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి.. భారత్ కొంపముంచుతోన్న గంభీర్ మొండి పట్టుదల

ఈ నేపథ్యంలో, పాత పరాభవాలను మరిచిపోయి కొలంబో, గాలే మైదానాల్లో ఆధిపత్యం చెలాయించాలని భారత్ పట్టుదలతో ఉంది. శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగా జరగనుంది. అలాగే రెండో టెస్టు మ్యాచ్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.

శ్రీలంకతో సిరీస్‌కు భారత్ సంభావ్య జట్టు ఇదే..!

ఈ సిరీస్ కోసం అనుభవజ్ఞులు, యువ రక్తం కలయికతో పటిష్టమైన 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బ్యాటర్లు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, దేవదూత్ పడిక్కల్, సాయి సుదర్శన్

ఆల్‌రౌండర్లు: రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి

స్పిన్నర్: కుల్దీప్ యాదవ్

ఫాస్ట్ బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us