AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత పార్టీలో రోజాను తొక్కేస్తున్నది ఎవరు? పదవులు రాకుండా అడ్డుకుంది ఎవరు..?

టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ నిర్వహించిన 'క్రాస్‌ఫైర్' ప్రోగ్రామ్‌లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ఎదుగుదలను సొంత పార్టీలోనే కొందరు అడ్డుకున్నారనే చర్చపై ఆమె స్పందించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి, రోజాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుందని ప్రచారం జరిగేది.

సొంత పార్టీలో రోజాను తొక్కేస్తున్నది ఎవరు?  పదవులు రాకుండా అడ్డుకుంది ఎవరు..?
Rk Roja, Ysrcp
Balaraju Goud
|

Updated on: May 09, 2026 | 8:12 PM

Share

టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్‌ నిర్వహించిన ‘క్రాస్‌ఫైర్’ ప్రోగ్రామ్‌లో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ఎదుగుదలను సొంత పార్టీలోనే కొందరు అడ్డుకున్నారనే చర్చపై ఆమె స్పందించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి, రోజాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుందని ప్రచారం జరిగేది. దీనిపై స్పందిస్తూ, జిల్లా రాజకీయాల్లో ఆధిపత్య పోరు సహజమని ఆమె సంకేతాలిచ్చారు.

తనకు మంత్రి పదవి రాకుండా, పార్టీలో ప్రాధాన్యత తగ్గించేలా పెద్దిరెడ్డి కుటుంబం చక్రం తిప్పిందన్న వార్తలను ఆమె పూర్తిగా ఖండించలేదు. రాజకీయాల్లో ఎదుటివారిని తొక్కేయడం అనేది ఒక వ్యూహమని, తన విషయంలోనూ అది జరిగి ఉండవచ్చని ఆమె పరోక్షంగా అంగీకరించారు. వైసీపీలో ఒంటరి పోరు చేస్తున్నానని, సొంత సామాజిక వర్గం నుంచి కాకుండా, బయటి వ్యక్తుల నుంచి తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యాయని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయకుండా కొందరు పెద్దలు అడ్డుపడ్డారనే విషయాన్ని ఆమె ఈ ఇంటర్వ్యూ ద్వారా బహిర్గతం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే