AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకు హీరో , అమ్మ డైరెక్టర్‌, నాన్న ప్రొడ్యూసర్‌.. రాయవలస టీజర్ లాంచ్ లో ఆకాష్ జగన్నాథ్

రాయవలస టీజర్ చాలా కనెక్టింగ్ గా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ఆకాశ్ జగన్నాథ్ అన్నారు. కార్తిక్ జయంతి హీరోగా నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.

కొడుకు హీరో , అమ్మ డైరెక్టర్‌, నాన్న ప్రొడ్యూసర్‌.. రాయవలస టీజర్ లాంచ్ లో ఆకాష్ జగన్నాథ్
Aakash
Rajeev Rayala
|

Updated on: May 09, 2026 | 7:40 PM

Share

కార్తిక్ జయంతి ని హీరోగా పరిచయం చేస్తూ రైసన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ రాయవలస. ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మించగా మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. “Love Tied by Fate” అనే ట్యాగ్‌లైన్ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ఈ వేడుకకు హాజరయ్యారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ టీజర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. టీజర్ చాలా బాగుంది. కార్తీక్ హీరోగా, వాళ్ల అమ్మగారు డైరెక్టర్‌గా, వాళ్ల నాన్నగారు ప్రొడ్యూసర్‌గా ఉండడం చాలా క్రేజీగా అనిపించింది.

ఇది కూడా చదవండి : ఆ హీరో నాకు చీర ఎలా కట్టుకోవాలో నేర్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన కృష్ణ కుమారి

అలాగే ఆయన మాట్లాడుతూ.. రాధిక గారికి హ్యాట్సాఫ్. తనంత బాధ్యత తీసుకుని వాళ్ల అబ్బాయిని హీరోగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వారు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కార్తీక్ చాలా టాలెంటెడ్. యాక్టింగ్, సింగింగ్, ప్రొడక్షన్ ఇలా అన్ని విషయాల్లో తనకు పూర్తి అవగాహన ఉంది. ఈ సినిమాలో ఎన్నో విషయాలు తన దగ్గరుండి చూసుకున్నాడు. హీరోగా తనకి ఇది పెద్ద స్టెప్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీష స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తోంది. రవివర్మ గారు, అనిత గారు, అన్నపూర్ణమ్మ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా బాగుంటే తెలుగు ఆడియన్స్ భుజాన వేసుకుని తీసుకెళ్తారు. ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యూ అని అన్నారు ఆకాష్.

ఇది కూడా చదవండి : అక్కినేని కథను మార్చి శోభన్ బాబు సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఊహించని రిజల్ట్

హీరో కార్తీక్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన దామోదర్ ప్రసాద్ గారికి, ఆకాష్ గారికి ధన్యవాదాలు. మీడియా అందరికీ థాంక్స్. టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా జరగడానికి కారణమైన మా అమ్మ, నాన్న, రాఖీ గారికి థాంక్యూ. సినిమా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఎక్సైట్మెంట్. నేను నా జీవితంలో ప్రేమించింది సినిమానే. నేను చేయాలనుకున్నది సినిమానే. దానికి తోడ్పడిన మా అమ్మకి థాంక్యూ. నా డ్రీమ్‌ని తన డ్రీమ్‌గా మార్చుకుని ఈ సినిమా చేశారు. నాకు మా నాన్న హీరో. పిల్లల్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడివరకు తీసుకొచ్చిన తల్లిదండ్రులందరికీ థాంక్యూ. ‘రాయవలస’ రియల్ లైఫ్ ఆధారంగా తీసుకున్న స్టోరీ. దానికి అందరూ కనెక్ట్ అవుతారని, ఆదరిస్తారని నమ్ముతున్నాను. మా ప్రమోషన్స్, కంటెంట్ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. రాజు-రాణి కథని మీరు అందరూ చూసి కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాకి హార్ట్. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు” అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : మనోడు మామూలోడు కాదు.. ఈయన ఆ స్టార్ డైరెక్టర్ అల్లుడా.!! బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శక్తివంతమైన గ్రహాలు ఢీ.. వీరి కెరీర్‌కు ముప్పే
శక్తివంతమైన గ్రహాలు ఢీ.. వీరి కెరీర్‌కు ముప్పే
ఆ హీరోకి కారు డ్రైవింగ్ నేర్పింది నేనే..
ఆ హీరోకి కారు డ్రైవింగ్ నేర్పింది నేనే..
ఆషాఢం అమావాస్య రోజే దిశ మార్చుకుంటున్న గురుడు.. వీరికి సమస్యలే
ఆషాఢం అమావాస్య రోజే దిశ మార్చుకుంటున్న గురుడు.. వీరికి సమస్యలే
ఒకే క్లిక్‌తో పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.. ఎలానో చూడండి
ఒకే క్లిక్‌తో పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.. ఎలానో చూడండి
ఎంత పని చేశావ్ భారతీ.. ఇద్దరు చిన్నారులను చంపి, ఆపై ఆత్మహత్య
ఎంత పని చేశావ్ భారతీ.. ఇద్దరు చిన్నారులను చంపి, ఆపై ఆత్మహత్య
బరువు తగ్గేందుకు సూపర్ ఫుడ్.. ఇలా చేస్తే ఇట్టే మొలకలు వస్తాయ్..
బరువు తగ్గేందుకు సూపర్ ఫుడ్.. ఇలా చేస్తే ఇట్టే మొలకలు వస్తాయ్..
ఈ యాప్‌తో మీ చూట్టుపక్కల పాములు ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు
ఈ యాప్‌తో మీ చూట్టుపక్కల పాములు ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు
ఇలా చారు పెట్టి అన్నంలో పోసుకుంటే.. జీర్ణ సమస్యలన్నీ ఫట్ అంతే..
ఇలా చారు పెట్టి అన్నంలో పోసుకుంటే.. జీర్ణ సమస్యలన్నీ ఫట్ అంతే..
షాపింగ్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై అన్నీ ఆఫర్లు బంద్..
షాపింగ్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై అన్నీ ఆఫర్లు బంద్..
రోహిత్ ఔట్.. సందిగ్ధంలో కోహ్లీ ప్లేస్.. బాంబ్ పేల్చిన గంభీర్..?
రోహిత్ ఔట్.. సందిగ్ధంలో కోహ్లీ ప్లేస్.. బాంబ్ పేల్చిన గంభీర్..?