AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనోడు మామూలోడు కాదు.. ఈయన ఆ స్టార్ డైరెక్టర్ అల్లుడా.!! బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ప్రముఖ నటుడు రవి శివ తేజ.. నెటిజన్స్ కు ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో వీడియోల ద్వారా చాలా పాపులర్ అయ్యాడు రవి శివ. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయ్యాడు.. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు రవి శివ తేజ.

మనోడు మామూలోడు కాదు.. ఈయన ఆ స్టార్ డైరెక్టర్ అల్లుడా.!! బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Ravi Siva Teja
Rajeev Rayala
|

Updated on: May 08, 2026 | 4:56 PM

Share

సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవి శివ తేజ.. యూట్యూబ్ లో చాలా పాపులర్ ఈయన. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రేక్షకులను అలరించాడు రవి. తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రవి శివ తేజ. రవి షార్ట్ ఫిలిమ్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది. అలాగే యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ  వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి ఆయన షార్ట్ ఫిలిమ్స్.  కాగా రవి ఓ ఇంటర్వ్యూలో తన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రవి ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ అల్లుడు అని చాలా మందికి తెలియకపోవచ్చు. విజయ్ భాస్కర్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఇక రవి మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి : బీటెక్ మధ్యలో వదిలేసింది.. రూ. 500తో వచ్చి రూ.100కోట్ల ఆస్తుపాస్తులు సంపాదించింది

తన భార్య దయ వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని, పెళ్లి చేసుకునే నాటికి తన జీవితంలో “నథింగ్” అని రవి స్పష్టం చేశారు. తన భార్య తన తండ్రి (విజయ్ భాస్కర్)ని ఒప్పించి, తాను మంచివాడినని, తనను బాగా చూసుకుంటానని చెప్పి తన గురించి నిలబడిందని తెలిపాడు. బయటివారు “అవసరం కోసం పెళ్లి చేసుకున్నాడు” అని భావించినప్పటికీ, తాను ఏ రోజూ అవసరం కోసం పెళ్లి చేసుకోలేదని రవి గట్టిగా చెప్పారు. విజయ్ భాస్కర్ తనను ఎప్పుడూ అల్లుడిగా కాకుండా, సొంత కొడుకులా చూసుకున్నారని, వారి మధ్య వృత్తిపరమైన దూరం ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. ఇద్దరం మా వృత్తిపరమైన విషయాలను పంచుకుంటాం, తదుపరి ప్రాజెక్టుల గురించి చర్చించుకుంటాం అని తెలిపాడు.

ఇది కూడా చదవండి :OTT Movie : హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే ట్విస్ట్.. ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్..

విజయ్ భాస్కర్ తనను ఒక నటుడిగా కాకుండా, ఒక మంచి మనిషిగా గుర్తించారని రవి అన్నాడు. అమ్మాయి కుటుంబం తన స్వగ్రామం వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు వచ్చి తన నేపథ్యాన్ని పరిశీలించిందని, అప్పుడు విజయ్ భాస్కర్ తనకు కూతురిని ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. 2018 డిసెంబర్ 12న ఎంగేజ్‌మెంట్, 2019 ఫిబ్రవరి 14న వివాహం జరిగిందని రవి వివరించారు. డబ్బు సంపాదిస్తున్నాడా లేదా అని చూడకుండా, తన కూతురు సంతోషంగా ఉంటుందా లేదా అని మాత్రమే ఆలోచించి తన మామగారు పెళ్లి చేశారని రవి కృతజ్ఞతగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : బికినీ వేసుకోమని ఫోర్స్ చేశాడు.. 19ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us