AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో నాకు చీర ఎలా కట్టుకోవాలో నేర్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన కృష్ణ కుమారి

వంగత నటి కృష్ణ కుమారి ఒకప్పుడు తెలుగు వెండితెరను ఏలిన అగ్రతార. చీరకట్టుతోనే పోత పోసిన బొమ్మలా కనిపించే ఆవిడ ప్రత్యేకతకు నిదర్శనం. అందం, అమాయకత్వం, అభినయం కలగలిసిన నటీమణిగా ఆ తరంలో తెలుగు వారందరినీ ఆమె ఎంతగానో అలరించారు .

ఆ హీరో నాకు చీర ఎలా కట్టుకోవాలో నేర్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన కృష్ణ కుమారి
Krishna Kumari
Rajeev Rayala
|

Updated on: May 08, 2026 | 8:37 PM

Share

సీనియర్ నటి కృష్ణ కుమారి తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. ఆమె తన కెరీర్ ప్రారంభంలో చీరకట్టు విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. అన్నపూర్ణమ్మ గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి, “మీరు ఆడవేషాలు అన్నీ వేసుకున్నారు కదా, కృష్ణ కుమారికి చీర కట్టుకోవడం నేర్పకూడదా.?” అని అడిగారని, ఆ తర్వాత నాగేశ్వరరావు గారు సెట్‌లో తనకు చీరకట్టు ఎలా సరిగా కట్టుకోవాలో చెప్పేవారని ఆమె వివరించారు. కట్టి చూపించారు కూడా అని ఆమె తెలిపారు. దీంతో తాను తర్వాత బాగా చీర కట్టుకోవడం అలవాటు చేసుకున్నానని తెలిపారు. చిన్ననాటి నుంచి తనకు రెండు జడలు వేసుకోవడం చాలా ఇష్టమని, పావడ దావణి వేసుకున్నప్పటి నుండి రెండు జడలతోనే ఉండేదాన్ని అని ఆమె చెప్పారు. తెరపై ఏ హీరోతో జంట బాగా కుదిరింది అని అడగగా, నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గార్లతో తన జంట చాలా బాగా సెట్ అయిందని కృష్ణ కుమారి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : బీటెక్ మధ్యలో వదిలేసింది.. రూ. 500తో వచ్చి రూ.100కోట్ల ఆస్తుపాస్తులు సంపాదించింది

ఆ ఇద్దరితోనే నటించాలని కోరుతూ అభిమానుల నుండి తనకు చాలా లేఖలు వచ్చేవని ఆమె తెలిపారు. తాను నటనను మానేసిన తర్వాత వచ్చిన అభిమానుల లేఖలు తనకు కన్నీళ్లు తెప్పించాయని, “ఎందుకు మానేశారు? మళ్ళీ నటించాలి” అని అభిమానులు కోరారని కృష్ణ కుమారి చెప్పారు. అప్పటికే తాను నూట పది తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించానని గుర్తు చేసుకున్నారు. నటన మానేసినందుకు కొంత పశ్చాత్తాపం కలిగినా, జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లినట్లు తెలిపారు. తర్వాత కొంతకాలం బలవంతం చేయగా కొన్ని క్యారెక్టర్ రోల్స్ కూడా చేశానని ఆమె వివరించారు. కృష్ణ కుమారి తెలుగు అమ్మాయి అయినప్పటికీ, ఆమె అన్ని భాషల్లో నటించారు. హిందీలో ఒక చిత్రంలో నటించి, తర్వాత వచ్చిన నాలుగు ఆఫర్లను విమాన ప్రయాణం భయం వల్ల వదులుకున్నానని చెప్పారు.

ఇది కూడా చదవండి :OTT Movie : హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే ట్విస్ట్.. ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్..

తనకు నచ్చిన భాషలో మాత్రమే స్వేచ్ఛగా నటించగలనని, తమిళంలో నటించినా ఆ వాతావరణానికి అంతగా దగ్గర కాలేదని, అందువల్ల తెలుగు సినిమాలపైనే దృష్టి సారించినట్లు తెలిపారు.కన్నడలో కూడా కొన్ని చిత్రాలు చేశాఅని ఆమె వెల్లడించారు. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన హిట్ పాటలు, మెలోడీ పాటలు ఉన్నాయని కృష్ణ కుమారి గుర్తు చేసుకున్నారు. “ఊహలు గుసగుసలాడే”, వాగ్దానం చిత్రంలోని “నా కంటి పాపలో నిలిచిపోరా”, గుడిగంటల్లో “నీలి కన్నుల నీడలలోనే”, “దూరాన నీలి మేఘాలు”, “తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసం?”, “పులకించని మది పులకించు” వంటి తన అభిమాన పాటలను ఆమె ప్రస్తావించారు. ఆ రోజుల్లో పాటల్లో ఎక్కువగా సిగ్గుపడడం, హావభావాలు ప్రదర్శించడం ఉండేదని, డ్యాన్స్‌లు అంతగా ఉండేవి కావని, స్టెప్పులు తరువాతి తరంలో వచ్చాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : బికినీ వేసుకోమని ఫోర్స్ చేశాడు.. 19ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రతీ నెలా అకౌంట్లోకి నేరుగా రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వ స్కీమ్..
ప్రతీ నెలా అకౌంట్లోకి నేరుగా రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వ స్కీమ్..
POCSO కేసులు తగ్గించేందుకు కేంద్రం కొత్త వ్యూహం.. అసలు సంగతి ఇదే
POCSO కేసులు తగ్గించేందుకు కేంద్రం కొత్త వ్యూహం.. అసలు సంగతి ఇదే
కోపంతో భర్త తలపై మొబైల్‌తో కొట్టిన భార్య..! అతడు మృతి
కోపంతో భర్త తలపై మొబైల్‌తో కొట్టిన భార్య..! అతడు మృతి
ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి రూ.20 వేలు
ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి రూ.20 వేలు
ఆ ఇద్దరు ఉంటే భయపడాలా ఏంది.. 3-0తో చిత్తుగా ఓడిస్తాం
ఆ ఇద్దరు ఉంటే భయపడాలా ఏంది.. 3-0తో చిత్తుగా ఓడిస్తాం
ఐఫోన్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్స్‌తో 18 సిరీస్
ఐఫోన్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్స్‌తో 18 సిరీస్
హర్మూజ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన..
హర్మూజ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన..
ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకులు మీ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చా..?
ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకులు మీ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చా..?
నాగార్జున అన్నయ్య అనే పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా.?
నాగార్జున అన్నయ్య అనే పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా.?
ఆర్మీలో చేరాలనుకునే యువతకు సువర్ణావకాశం.. రాత పరీక్ష లేదు
ఆర్మీలో చేరాలనుకునే యువతకు సువర్ణావకాశం.. రాత పరీక్ష లేదు