Rohit Sharma: 4355 రోజుల నిరీక్షణకు చెక్ పెట్టేశాడు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డులో ఎంట్రీ ఇచ్చిన హిట్‌మ్యాన్
Rohit Sharma Unwanted Record: రోహిత్ శర్మ ఐపీఎల్‌లో సెంచరీ చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. అయితే ముంబై జట్టు ఓడిపోయింది. రోహిత్ 105 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇతర ముంబై బ్యాటర్లు ఎవరూ రోహిత్‌కు మద్దతు ఇవ్వేలకపోయారు. దీంతో ముంబై జట్టు 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Rohit Sharma Unwanted Record in IPL: చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో ఓడిపోయి ఉండవచ్చు. కానీ, ముంబై వాంఖడేలో ఒక్క పేరు మాత్రమే ప్రతిధ్వనించింది. అది రోహిత్ శర్మ. ఈ బ్యాట్స్‌మన్ చివరి వరకు తన జట్టుకు అండగా నిలిచి 63 బంతుల్లో 105 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మరే ఇతర బ్యాట్స్‌మెన్ నుంmr మద్దతు లేకపోవడంతో, చివరికి ముంబై ఇండియన్స్ జట్టు పరాజయం పాలైంది. రోహిత్ శర్మ IPL 2024 సీజన్‌లో మొదటి సెంచరీని సాధించాడు. దీనితో అతను 4355 రోజుల నిరీక్షణను ముగించాడు.
చివరి సెంచరీ 2012లో..
36 ఏళ్ల రోహిత్ శర్మ చివరిసారిగా మే 12, 2012న కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఈడెన్ గార్డెన్స్‌లో సెంచరీ చేశాడు. అయితే, రోహిత్ శర్మ ఈ సెంచరీని గుర్తుంచుకోవడానికి ఇష్టపడడు. రోహిత్ 20 ఓవర్లు మొత్తం బ్యాటింగ్ చేసినా చివరికి ముంబై జట్టు 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. తిలక్ వర్మ 31 పరుగులు మినహా మరే ఆటగాడు ఇంతకు మించి పరుగులు చేయలేకపోయాడు.
చెత్త రికార్డులో హిట్‌మ్యాన్ పేరు..
రోహిత్ శర్మ తన పేరిట సెంచరీ చేసినప్పటికీ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. అతను ఐపీఎల్ చరిత్రలో పరుగుల వేటలో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. చివరి వరకు నాటౌట్‌గా ఉన్నాడు. అయితే, ఇలా ఉన్నప్పటికీ ముంబై జట్టు ఓడిపోయింది. ఇందులో యూసుఫ్ పఠాన్, సంజూ శాంసన్ పేర్లు కూడా ఉన్నాయి. ఈ ముగ్గురూ ముంబైలో ఆడారు. ఇందులో వాంఖడే స్టేడియంలో రెండు మ్యాచ్‌లు జరిగాయి.
ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసినప్పటికీ జట్టు ఓడిపోయిన సందర్భాలు..
| ప్లేయర్ | ఎప్పుడు | సెంచరీ | ఎక్కడ |
| యూసుఫ్ పఠాన్ | రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (2008) | 37 బంతుల్లో 100 పరుగులు | ముంబై-బ్రబోర్న్ |
| సంజూ శాంసన్ | రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ (2021) | 63 బంతుల్లో 119 పరుగులు | ముంబై-వాంఖడే |
| రోహిత్ శర్మ | ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ (2024) | 64 బంతుల్లో నాటౌట్‌గా 105 పరుగులు | ముంబై-వాంఖడే |
ఐపీఎల్ 2024లో రోహిత్ సాధించిన సెంచరీ భారతీయ ఆటగాడి రెండో సెంచరీ అని తెలిసిందే. విరాట్ కోహ్లి గతంలో రాజస్థాన్ రాయల్స్‌పై సెంచరీ చేసినప్పటికీ బెంగళూరు జట్టు చివరికి ఓడిపోయింది. ఇటువంటి పరిస్థితిలో, మాజీ కెప్టెన్లిద్దరూ ప్రత్యర్థులపై సెంచరీలు చేసినప్పటికీ జట్టు ఓడిపోవడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




