Team India: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అగ్రస్థానంలో నిలిచినా.. రిటైర్మెంట్ చేయించేందుకు భారీ స్కెచ్..

Rohit Sharma - Virat Kohli: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టీ20ఐ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన లిస్టులో అగ్రస్థానంలో ఉన్నారు. అయితే, ఈ ఇద్దరిపై బీసీసీఐ వేటు వేసేందుకు సిద్ధమైంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో యువ ఆటగాళ్లను చేర్చుకోవాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

Team India: రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. అగ్రస్థానంలో నిలిచినా.. రిటైర్మెంట్ చేయించేందుకు భారీ స్కెచ్..
Virat Kohli Rohit Sharma In
Follow us
Venkata Chari

|

Updated on: Jan 10, 2023 | 9:52 AM

Rohit Sharma – Virat Kohli: టీమిండియాలో అత్యంత ప్రసిద్ధి చెందిన క్రికెటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా ఉంటారు. అయితే, ఈ దిగ్గజ ఆటగాళ్లపై బీసీసీఐ వేటు వేసేందుకు సిద్ధమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై ఎంపిచేసే టీ20 జట్టులో వీరిద్దరు ఇక కనిపించరని తెలుస్తోంది. ఈ అనుభవజ్ఞులైన జోడీ దశాబ్దానికి పైగా భారత క్రికెట్‌కు మూలస్తంభాలుగా ఉన్నారు. అయితే ఫ్యూచర్ ప్లాన్‌లో భాగంగా పొట్టి ఫార్మాట్‌ నుంచి వీరిని తప్పించేందుకు ప్లాన్ చేసిందంట. యూఎస్‌ఏలో 2024 టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఫార్మాట్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఇక హార్దిక్ పాండ్యా టీమిండియా టీ20ఐ సారథిగా నియమించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయంట.

జనవరి 7న నియమించిన చేతన్ శర్మ నేతృత్వంలోని కొత్త బీసీసీఐ సెలక్షన్ కమిటీ విరాట్, రోహిత్‌లతో టీ20 భవిష్యత్తుకు సంబంధించి చర్చలు జరిపే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ స్టార్ ద్వయం మాత్రం టీ20ల నుంచి తప్పుకోవడంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎంపిక కోసం తాము అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కానీ, టీ20లకు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టును బీసీసీఐ కోరుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

శ్రీలంకతో ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు హార్దిక్ పాండ్యా భారత T20I జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. టీ20ఐ కెప్టెన్‌గా రోహిత్ సమయం ముగిసిపోవచ్చని ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. రోహిత్, భారత మాజీ కెప్టెన్ విరాట్ ఇద్దరూ శ్రీలంకతో జరిగిన T20I జట్టులో భాగంగా లేరు. అయితే ఈ జోడీ ప్రస్తుతం ODI జట్టులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

జూన్, 2007లో వన్డేల్లో రోహిత్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను తన మొదటి T20Iని అదే సంవత్సరం సెప్టెంబర్‌లో ఆడాడు. మరోవైపు, విరాట్ ఆగష్టు, 2008లో శ్రీలంకతో జరిగిన ODI మ్యాచ్‌లో తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. జూన్, 2010లో తన మొదటి T20I ఆడాడు. ఇద్దరూ టీ20 ప్రపంచ కప్‌లలో భారతదేశానికి నాయకత్వం వహించారు. కానీ, గెలవలేకపోయారు.

టీ20ఐలలో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో వీరిద్దరు అగ్రస్థానంలో ఉన్నారు. విరాట్ 115 మ్యాచ్‌లలో 52.73 సగటుతో 4008 పరుగులతో చార్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ 148 మ్యాచ్‌ల్లో 31.32 సగటుతో 3853 పరుగులతో ఆ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

సోమవారం, గౌహతిలో శ్రీలంకతో జరగనున్న తొలి వన్డే సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, పొట్టి ఫార్మాట్‌ను వదులుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. “మాకు ఆరు టీ20లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే మూడు ముగిశాయి. తర్వాతి టీ20ల్లో ఆడతాం. ఐపీఎల్ తర్వాత ఏమి జరుగుతుందో చూస్తాం. కానీ ఖచ్చితంగా, నేను టీ20 నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోలేదు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

కొంతమంది సీనియర్ ఆటగాళ్ల పనిభారం కారణంగా శ్రీలంకతో టీ20లు కొత్త లుక్‌తో జట్టు ఆడిందని రోహిత్ తెలిపాడు. “మీరు షెడ్యూల్‌ను పరిశీలిస్తే, బ్యాక్-టు-బ్యాక్ మ్యాచ్‌లు ఉన్నాయి. కాబట్టి మేం కొంతమంది ఆటగాళ్ల పనిభారాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాం. వారికి తగినంత విరామం లభించేలా, షెడ్యూల్‌ను రూపొందించాం” అని రోహిత్ తెలిపాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..