Cricket: 17 బంతుల్లో 84 పరుగులు.. 5గురి బౌలర్ల ఊచకోత.. కట్ చేస్తే.. చివరికి సీన్ రివర్స్..
పొట్టి ఫార్మట్ వచ్చిదంటే చాలు.. పరుగుల వరద పారుతుంది. అందుకే ఈ మధ్య డొమెస్టిక్ టీ20 మ్యాచ్‌లు ఎక్కువైపోతున్నాయి.
పొట్టి ఫార్మట్ వచ్చిదంటే చాలు.. పరుగుల వరద పారుతుంది. అందుకే ఈ మధ్య డొమెస్టిక్ టీ20 మ్యాచ్‌లు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆయా దేశాల క్రికెటర్లు కూడా సదరు మ్యాచ్‌లలో అద్భుతంగా రాణిస్తున్నారు. తాజాగా ఇదే కోవలో ఓ యువ పాకిస్థాన్ ప్లేయర్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అతడు మరెవరో కాదు.. 24 ఏళ్ల అజామ్ ఖాన్. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఖుల్న టైగర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అజామ్ ఖాన్ తాజాగా చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే సెంచరీతో అదరగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్న టైగర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్(40) రాణించగా.. సెకండ్ డౌన్‌లో బరిలోకి దిగిన అజామ్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. 58 బంతులు ఎదుర్కున్న అతడు 9 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో తనవంతు కీలక పాత్ర పోషించాడు. చట్టోగ్రామ్ జట్టులో అబు జాయెద్ 2 వికెట్లు పడగొట్టగా.. శువగాట్, వియస్కాంత్, జియూర్ చెరో వికెట్ తీశారు.
ఇక 179 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన చట్టోగ్రామ్ జట్టుకు ఓపెనర్లు ఉస్మాన్ ఖాన్(103), మాక్స్ దౌడ్(58) మెరుపు ఇన్నింగ్స్‌లతో అదరగొట్టారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 141 పరుగులు జోడించారు. ఈ చేజ్‌లో ఉస్మాన్ ఖాన్ 58 బంతులు ఎదుర్కుని 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో చట్టోగ్రామ్ ఛాలెంజర్స్ 9 వికెట్ల తేడాతో ఖుల్న టైగర్స్‌ను ఓడించింది. కాగా, అటు అజామ్ ఖాన్, ఇటు ఉస్మాన్ ఖాన్‌కు టీ20లలో ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం.