AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Test Cricket: 34 మ్యాచ్‌ల తర్వాత తొలి టెస్ట్ విజయం.. సెలబ్రేషన్స్‌తో రచ్చ చేసిన టీం.. ఆ జట్టు ఏదంటే?

బంగ్లాదేశ్ 2000 సంవత్సరంలో టెస్ట్ జట్టు హోదాను పొందింది. అయితే ఈ జట్టు తన మొదటి టెస్ట్ విజయాన్ని పొందడానికి చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది.

Test Cricket: 34 మ్యాచ్‌ల తర్వాత తొలి టెస్ట్ విజయం.. సెలబ్రేషన్స్‌తో రచ్చ చేసిన టీం.. ఆ జట్టు ఏదంటే?
Bangladesh
Venkata Chari
|

Updated on: Jan 10, 2023 | 9:21 AM

Share

బంగ్లాదేశ్ ప్రస్తుత కాలంలో మంచి జట్టుగా పేరుగాంచింది. ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ను ఓడించిన ఈ జట్టు, టెస్టు సిరీస్‌లోనూ గట్టిపోటీ ఇచ్చింది. 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్‌కు టెస్టు హోదా లభించింది. అయితే ఈ జట్టు తొలి విజయం సాధించేందుకు దాదాపు ఐదేళ్లు పట్టింది. బంగ్లాదేశ్ తన మొదటి టెస్ట్ విజయాన్ని ఈ రోజున అంటే 2005 జనవరి 10న జింబాబ్వేపై అందుకుంది. ఈ టెస్టు మ్యాచ్ జనవరి 6న ప్రారంభమై జనవరి 10న ముగిసింది.

ఈ విజయం సాధించడానికి ముందు బంగ్లాదేశ్ చాలా కష్టపడింది. బంగ్లాదేశ్ తొలి టెస్టు విజయం కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఈ జట్టు 34 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత మొదటి టెస్ట్ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ విజయం చాలా ప్రత్యేకంగా నిలిచింది. బంగ్లాదేశ్ జింబాబ్వేను భారీ తేడాతో ఓడించింది.

226 పరుగుల తేడాతో భారీ విజయం..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 488 పరుగులు చేసింది. కెప్టెన్ హబీబుల్ బషర్ 94 పరుగులు చేశాడు. రజిన్ సలే 89 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. మహ్మద్ రఫిక్ కూడా హాఫ్ సెంచరీ చేసి 69 పరుగులు చేశాడు. ఓపెనర్ నఫీస్ ఇక్బాల్ కూడా చక్కటి సహకారం అందించి 56 పరుగులు చేశాడు. మష్రఫే మొర్తజా 48 పరుగులతో సఫలమయ్యాడు. దీనికి సమాధానంగా జింబాబ్వే జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకే ఆలౌటైంది. అతనికి కెప్టెన్ టాటెండ టైబు 92, ఎల్టన్ చిగంబుర 71 పరుగులు చేశారు.

ఇవి కూడా చదవండి

అనంతరం బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 204 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో 80 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసిన కెప్టెన్ బషర్ బ్యాట్ కూడా ఉంది. అనంతరం జింబాబ్వేకు బంగ్లాదేశ్ 381 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్ చివరి రోజున జింబాబ్వే జట్టు 154 పరుగులకు ఆలౌట్ కావడంతో బంగ్లాదేశ్ తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన ఇనాముల్ హక్ జూనియర్ ఆరు వికెట్లు తీశాడు. ముర్తాజా, తపస్ బెష్యా చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 226 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయాన్ని బంగ్లాదేశ్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.

నాలుగు సంవత్సరాల తర్వాత మలి విజయం..

ఈ విజయం తర్వాత, బంగ్లాదేశ్ తమ టెస్ట్ ఆటను మెరుగుపరుస్తుందని భావించారు. అయితే ఆ జట్టు తమ తదుపరి టెస్ట్ విజయం కోసం నాలుగేళ్లపాటు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ విజయం తర్వాత నాలుగేళ్లకు బంగ్లాదేశ్ టీం వెస్టిండీస్‌ను ఓడించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు ఏ టీంతోనైనా పోటీపడే శక్తిని కలిగి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..