Viral Video: చీరకట్టులో మహిళ వర్కవుట్స్.. వీడియో మాములుగా లేదుగా.. చూస్తే పరేషాన్!
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే..
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయం కలిగిస్తాయి. ఇంకొన్ని అయితే.. మనల్ని పూర్తిగా ఆశ్చర్యపరుస్తాయి. మరి అలాంటి కోవకు చెందిన ఓ వీడియోనే ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. ఇందులో ఓ మహిళ చీరకట్టులో వర్కవుట్స్ చేసింది. దాన్ని చూస్తే మీరు కూడా పరేషాన్ కావడం ఖాయం. మరి లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి..
సాధారణంగా కొంతమంది మహిళలు చీరకట్టులో నడవడానికే ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ మహిళ ఏకంగా కసరత్తులు, వ్యాయామం చేసి మరీ చూపించింది. ఓ మహిళ చీరలో డంబుల్స్ ఎత్తడం, లాట్ పుల్‌డౌన్ లాంటి వర్క్‌వుట్స్‌తో పాటు భారీ టైర్‌ను సైతం అవలీలగా ఎత్తేసింది. మగవారికి ఏమాత్రం తగ్గకుండా చీరలో ఆమె చేసిన స్టంట్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ వీడియో నెట్టింట మిలియన్ల వ్యూస్ దక్కించుకుంటోంది. మరి లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram