Viral: తొలిరాత్రి అని ఎంతో ఉత్సాహంగా ఉన్న భర్త.. సీన్ కట్ చేస్తే.. భార్య చేసిన పనికి మైండ్ బ్లాంక్..
వారిద్దరికీ కొత్తగా పెళ్లైంది. వివాహం గ్రాండ్‌గా జరిగింది. అలాగే తన హనీమూన్ ట్రిప్ కూడా అంతే గ్రాండ్‌గా ఉండాలని భావించాడు ఓ యువకుడు.
వారిద్దరికీ కొత్తగా పెళ్లైంది. వివాహం గ్రాండ్‌గా జరిగింది. అలాగే తన హనీమూన్ ట్రిప్ కూడా అంతే గ్రాండ్‌గా ఉండాలని భావించాడు ఓ యువకుడు. అనుకున్నట్లుగానే హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే మనోడు అనుకున్నది ఒకటయితే.. అక్కడ జరిగింది మరొకటి. హనీమూన్‌లో ఉండగా ఫస్ట్ నైట్ అర్ధరాత్రి నిద్రలేచిన భర్తకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంతకీ అతడికి షాక్ తగిలేలా భార్య ఏం చేసిందో తెలిస్తే ఫ్యూజులు ఎగరడం ఖాయం. అసలేం ఏం జరిగిందంటే..
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన సత్యం అనే యువకుడికి ఆగ్రా యువతి దీపాసినితో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వివాహం అనంతరం సత్యం తన హనీమూన్ ట్రిప్‌ను కూడా భారీగా ప్లాన్ చేశాడు. అనుకున్నట్లుగానే డిసెంబర్ 8వ తేదీన భార్యతో కలిసి ఉత్తరాఖండ్ వెళ్లాడు. ఇక నెక్స్ట్ డే 9వ తారీఖున రిషికేశ్‌లోని ఓ పెద్ద హోటల్‌లో సత్యం తన భార్యతో కలిసి ఓ రూమ్‌ను అద్దెకు తీసుకున్నాడు. ఆ రోజు తన తొలిరాత్రి అని ఎంతో ఉత్సాహంగా ఉన్న సత్యం.. అతడి భార్యకు టీ తీసుకురమ్మని చెప్పాడు. ఆమె తీసుకొచ్చిన టీ తాగిన వెంటనే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అతడికి అర్ధరాత్రి గానీ మళ్లీ మెలుకవ రాలేదు. నిద్రలేచి చూసేసరికి గదిలో తన భార్య కనిపించకపోవడమే కాదు.. రూ.30 వేల నగదు, రూ.3.4 లక్షల విలువైన నగలతో పాటు వివిధ రకాల సామాన్లు కూడా మాయమయ్యాయి. దీంతో సత్యం ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌ను చెక్ చేశాడు. దీపాసిని రాత్రి 7 గంటల సమయంలోనే హోటల్ విడిచి వెళ్లిపోయినట్లు కనిపించింది. దీంతో తాను మోసపోయాయని తెలుసుకున్న సత్యం పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై ఖాకీలు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి.
అన్షు యాదవ్‌తొప్ దీపాసినికి ఇదివరకే పెళ్లైందని.. ఆ విషయాన్ని దాచిపెట్టి ఆమె సత్యాన్ని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో పలుమార్లు ఈమె ఇలానే ఇళ్లు విడిచి వెళ్ళినట్లు విచారణలో తేలింది. ఇక అటు దీపాసిని కుటుంబ సభ్యులు కూడా సత్యంపై రివర్స్‌లో కేసు పెట్టారు. తమ కూతురిపై దాడి చేసి, అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడంటూ అతడిపై యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కూడా దర్యాప్తులో ఉంది.