Ricky Ponting: హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్.. మళ్లీ మైక్ పట్టుకున్న పాంటింగ్
ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న పాంటింగ్ అకస్మాత్తుగా ఛాతి నొప్పి బారిన పడ్డాడు. దీంతో సహచరులు జస్టిన్ లాంగర్, క్రిస్ జోన్స్ వెంటనే అతనిని పెర్త్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పాంటింగ్ గుండెపోటుకు గురయ్యారనే వార్తతో అతని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఛాతిలో నొప్పితో ఆస్పత్రి పాలైన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ కోలుకున్నాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో మళ్లీ కామెంటేటర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. కాగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న పాంటింగ్ అకస్మాత్తుగా ఛాతి నొప్పి బారిన పడ్డాడు. దీంతో సహచరులు జస్టిన్ లాంగర్, క్రిస్ జోన్స్ వెంటనే అతనిని పెర్త్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పాంటింగ్ గుండెపోటుకు గురయ్యారనే వార్తతో అతని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఫ్యాన్స్ కోరుకున్నట్లే పాంటింగ్ కోలుకున్నాడు. అయితే పాంటింగ్ ఆస్పత్రి నుంచి డిచ్చార్జ్ అయ్యి రెస్ట్ తీసుకుంటాడని చాలామంది భావించారు. కానీ అతను తిరిగి మళ్లీ కామెంటరీ బాక్స్‌లో కనిపించి అందరనీ ఆశ్చర్యపరిచాడు.
ఇదిలా ఉంటే పాంటింగ్ కూడా తన ఆరోగ్యం గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘నేను నిన్న చాలా మందిని భయపెట్టాను. నిజం చెప్పాలంటే అది నాకు కూడా భయంకరమైన క్షణం. నేను కామెంటరీ బాక్స్‌లో కూర్చొని ఉండగా హఠాత్తుగా గుండెలో నొప్పి మొదలైంది. నొప్పి తీవ్రంగా ఉండడంతో కామెంటరీ కూడా ఎక్కువగా ఇవ్వలేదు. చివరకు కామ్ బ్యాక్స్‌ను విడిచి పెట్టి వెళ్లిపోదామని నిర్ణయించకున్నాను. కానీ లేచిన వెంటనే ఒక్క సారిగా మైకంలోకి వెళ్లినట్లు అనిపించింది. వెంటనే అక్కడ ఉన్న బెంచ్‌ను పట్టుకున్నాను. నా సమస్యను నాతో పాటే ఉన్న సహచరులు లాంగర్, క్రిస్ జోన్స్‌కు చెప్పాను. వారు వెంటనే నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చికిత్స తీసుకున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. మళ్లీ కామెంటేటర్‌గా నా బాధ్యతలు నిర్వర్తిస్తాను’ అని చెప్పుకొచ్చాడీ లెజెండరీ క్రికెటర్.
“I mentioned to JL who was commentating with me that I’d had these pains in my chest … 10 or 15 minutes later I was in the hospital getting the best treatment I possibly could.”
– @RickyPonting talks about his last 24 hours pic.twitter.com/GnW8OADghg
— 7Cricket (@7Cricket) December 3, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..