Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs ENG: బౌలర్‌ బట్టతలపై బంతిని రుద్ది.. బ్యాటర్లను బుట్టలో పడేసి.. వర్కౌటైన రూట్ వెరైటీ ట్రిక్

ధారణంగా టెస్ట్‌ క్రికెట్‌లో బంతిపై పట్టు సాధించేందుకు బౌలర్లు తొడల వద్ద ప్యాంట్‌కు రుద్దుతారు. గతంలో ఉమ్మి (సెలైవా)ని బంతిపై రాస్తున్నా కరోనా కారణంగా ఐసీసీ దీనిని నిషేధించింది.

PAK vs ENG: బౌలర్‌ బట్టతలపై బంతిని రుద్ది.. బ్యాటర్లను బుట్టలో పడేసి.. వర్కౌటైన రూట్ వెరైటీ ట్రిక్
Pak Vs Eng
Follow us
Basha Shek

|

Updated on: Dec 03, 2022 | 4:11 PM

పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు బ్యాటర్లకు స్వర్గధామంగా మారింది. రావల్పిండి వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో ఇరు జట్ల స్టార్‌ బ్యాటర్లు సెంచరీల మోత మోగిస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఓలి పోప్, హ్యారీ బ్రూక్స్ శతక్కొట్టారు. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగన ఆతిథ్య జట్టు కూడా ధాటిగా బ్యాటింగ్‌ చేసింది. అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్ మొదటి వికెట్‌కు ఏకంగా 225 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షఫీక్ 114 పరుగుల వద్ద అవుట్ అయిన కొద్దిసేపటికే, ఇమామ్ కూడా 121 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో పాకిస్థాన్ 245 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ బాబర్ అజామ్, అజహర్ అలీలు బాధ్యత తీసుకున్నారు. నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ ఇంగ్లండ్ బౌలర్లకు విసుగు తెప్పించాడు. ఇక్కడే మాజీ కెప్టెన్ జో రూట్ బంతికి మెరుగు తెప్పించేందుకు ఓ ట్రిక్‌ను అప్లై చేశాడు. సాధారణంగా టెస్ట్‌ క్రికెట్‌లో బంతిపై పట్టు సాధించేందుకు బౌలర్లు తొడల వద్ద ప్యాంట్‌కు రుద్దుతారు. గతంలో ఉమ్మి (సెలైవా)ని బంతిపై రాస్తున్నా కరోనా కారణంగా ఐసీసీ దీనిని నిషేధించింది.

బౌలర్ బట్టతలపై ..

ఈనేపథ్యంలో బంతిపై పట్టు సాధించేందుకు జో రూట్‌ ఓ వినూత్నమైన పద్ధతిని ఎంచుకున్నాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ 72వ ఓవరల్లో స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ను దగ్గరికి పిలిచిన రూట్‌.. అతడి బట్టతలపై చెమటను ఉపయోగించి బాల్‌ను షైన్‌ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ మరుసటి ఓవర్లో రాబిన్సన్‌ బౌలింగ్‌లో పాక్‌ కేవలం రెండే పరుగులు రాబట్టడం విశేషం. మ్యాచ్‌లో 27 పరుగులు చేసిన అజహర్ లీచ్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

రూట్ పాచిక పారినట్లే..

రూట్‌ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు ఆరు సెంచరీలు నమోదయ్యాయి. దీన్ని బట్టి చెప్పొచ్చు పిచ్‌ ఎలాగుందో, ‘బట్టతలపై బంతిని షైన్‌ చేయడం బాగుంది.. మరుసటి ఓవర్లో 2 పరుగులు.. రూట్‌ ట్రిక్‌ సక్సెస్‌ అయినట్లే లెక్క’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడో రోజు పాక్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ (110), మహమ్మద్‌ రిజ్వాన్‌ (4) క్రీజులో ఉన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..