RCB vs DC, Playing 11: బ్యాడ్ లక్ టీంల పోరు షురూ.. టాస్ గెలిచిన ఢిల్లీ.. ప్లేయింగ్ XIలో కీలక ప్లేయర్ ఎంట్రీ..

బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేయనుంది.

RCB vs DC, Playing 11: బ్యాడ్ లక్ టీంల పోరు షురూ.. టాస్ గెలిచిన ఢిల్లీ.. ప్లేయింగ్ XIలో కీలక ప్లేయర్ ఎంట్రీ..
Rcb Vs Dc Live
Follow us
Venkata Chari

|

Updated on: Apr 15, 2023 | 3:16 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 20వ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేయనుంది.

డేవిడ్ విల్లీ స్థానంలో వనిందు హసరంగ మళ్లీ జట్టులోకి వచ్చాడు.

ఈరోజు డబుల్ హెడ్డర్ డే. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు లక్నో సూపర్‌జెయింట్స్ (LSG) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ చాలా పేలవంగా ఉంది. మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయిన కారణంగా ఇంకా ఖాతా తెరవలేదు. అదే సమయంలో, విజయంతో ప్రారంభించిన బెంగళూరు తర్వాతి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. దీంతో నేటి మ్యాచ్ ఇరుజట్లకు ఎంతో కీలకంగా మారింది.

ఇరు జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (కీపర్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ముస్తాఫిజుర్ రెహమాన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..