AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Cinema: మొదలెట్టేశారుగా.. ఇకపై జియో సినిమా ఉచితం కాదు.. వారికి మాత్రం బిగ్ రిలీఫ్..

ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌లను ఉచితంగా అందిస్తున్న జియో సినిమా (Jio cinema).. మరో అడుగు ముందుకు వేసింది. నెట్ ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాగా జియో స్టూడియోస్ పేరుతో భారీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా మార్చేందుకు రిలయన్స్‌ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు 100కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లను జియో సినిమాలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది.

Jio Cinema: మొదలెట్టేశారుగా.. ఇకపై జియో సినిమా ఉచితం కాదు.. వారికి మాత్రం బిగ్ రిలీఫ్..
Jio Cinema
Venkata Chari
|

Updated on: Apr 15, 2023 | 4:57 PM

Share

ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌లను ఉచితంగా అందిస్తున్న జియో సినిమా (Jio cinema).. మరో అడుగు ముందుకు వేసింది. నెట్ ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాగా జియో స్టూడియోస్ పేరుతో భారీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా మార్చేందుకు రిలయన్స్‌ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు 100కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లను జియో సినిమాలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది. దీంతోపాటే యూజర్లకు ఓ బ్యాడ్ న్యూస్ కూడా అందించనుంది. ఈ కంటెంట్‌ చూసేందుకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను కూడా సిద్ధంచేయనుందంట. అయితే ఇందులో క్రికెట్ అభిమానులకు మాత్రం గుడ్ న్యూస్ అందించింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లను మాత్రం ఫ్రీగానే చూడొచ్చని పేర్కింది.

Jio Studios బుధవారం ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. అమీర్ ఖాన్ నుంచి హృతిక్ రోషన్, యామీ గౌతమ్, దర్శకుడు ఆదిత్య ధర్, కృతి సనన్ సహా పలువురు తారలు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో జియో స్టూడియోస్ 10 కాదు, 20 కాదు, ఏకంగా 100కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రకటించింది. ఇందులో టాప్ ఫిల్మ్‌మేకర్‌ల నుంచి స్టార్ హీరోలు, హీరోయిన్లు, కొత్త ప్రతిభావంతులైన నటులు నటించనున్నారు. OTT ప్లాట్‌ఫారమ్‌లో అరంగేట్రం చేయబోతున్న నటీనటులతో కలిసి పని చేస్తారు.

ఐపీఎల్‌ 2023 సీజన్ మే 28తో పూర్తవుతుంది. ఈ లోపే కొత్త కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అలాగే ప్రీమియం కంటెట్‌ను అందుబాటు ధరల్లోనే ఉంచనున్నట్లు రిలయన్స్‌ మీడియా, కంటెంట్‌ బిజినెస్‌ హెడ్ జ్యోతి దేశ్‌ పాండే తెలిపారు. క్రికెట్ అభిమానులు మాత్రం ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఫ్రీగానే చూడొచ్చని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌ డిజిటల్ ప్రసారాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఐపీఎల్ 2023 సీజన్ మొదలైన తొలి వారంలోనే జియో సినిమా యాప్ 5.5 బిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఏప్రిల్‌ 12న చెన్నై వర్సెస్ రాజస్థాన్‌ టీంల మధ్య జరిగిన మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 22 మిలియన్ల మంది చూశారని పేర్కొంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!