Video: సొంత మైదానంలో వరుసగా 4వ హాఫ్ సెంచరీ.. విర్రవీగిన బంగ్లా బౌలర్లకు ఇచ్చి పడేసిన అశ్విన్..
Ravichandran Ashwin Half Century: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఏడాది ఆరంభంలో ఆధిపత్యం చెలాయించిన రెండు దేశాలు ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై అందరి చూపులు నెలకొన్నాయి.
Ravichandran Ashwin Half Century: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఏడాది ఆరంభంలో ఆధిపత్యం చెలాయించిన రెండు దేశాలు ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై అందరి చూపులు నెలకొన్నాయి. భారత్ స్వదేశంలో ఇంగ్లండ్‌ను 4-1తో ఓడించగా, బంగ్లాదేశ్ పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది (2-0).
అయితే, టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోన్న భారత జట్టుకు పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. ఈ క్రమంలో జైస్వాల్, రవిచంద్రన్ అశ్విన్‌లు హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. జైస్వాల్ ఔట్ అయిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ 58 బంతుల్లో 50 పరుగులు చేసి భారత్ స్కోరును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడ్డాడు. 124 బంతుల్లో 111 పరుగులు జోడించి అశ్విన్, జడేజాలు భారీ స్కోర్ దిశగా భారత జట్టును తీసుకెళ్తున్నారు.
బంగ్లాదేశ్ ఆటగాడు హసన్ మహమూద్ నాలుగు వికెట్లు తీసి, భారత జట్టుకు బిగ్ షాక్ ఇచ్చాడు. జైస్వాల్ 56 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు, రాహుల్ 52 బంతుల్లో 16 పరుగుల వద్ద ఔటయ్యాడు.
పంత్ 52 బంతుల్లో 39 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లి, పంత్నాలుగు కీలక వికెట్లు తీసిన హసన్ మహమూద్ బంగ్లాదేశ్ జట్టుకు ఆశలు పెంచాడు.
అశ్విన్ టెస్టు కెరీర్‌లో 15వ హాఫ్ సెంచరీ..
An applause for @ashwinravi99 across ages! 👏👏
Live – https://t.co/jV4wK7BgV2… #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/SsE9w5VV4u
— BCCI (@BCCI) September 19, 2024
రవిచంద్రన్ అశ్విన్ కీలక సమయంలో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 60వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి ఫిఫ్టీని పూర్తి చేశాడు. అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో 15వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
అశ్విన్-జడేజా సెంచరీ భాగస్వామ్యం..
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 7వ వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 62వ ఓవర్లో నహిద్ రాణా వేసిన బంతికి జడేజా సింగిల్ తీసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో టీమిండియా 144 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.
చెపాక్ ఛాంపియన్‌గా అశ్విన్..
ఇక చెపాక్ మైదానం గురించి మాట్లాడుకుంటే అశ్విన్ బ్యాటింగ్ మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ మైదానంలో ఇప్పటివరకు 5 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఈ ఆటగాడు 48 సగటుతో తన బ్యాట్‌తో దాదాపు 300 పరుగులు చేశాడు. ఈ మైదానంలో సెంచరీ కూడా చేశాడు. ఇంగ్లండ్‌పై ఈ సెంచరీ సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..