AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ‘నన్నే ఎందుకు టార్గెట్ చేశారు’.. లైవ్ మ్యాచ్‌లో గొడవ పడిన పంత్, లిటన్ దాస్.. వైరల్ వీడియో

Rishabh Pant and Litton Das Argument video: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఈ రోజు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభమైంది. కాగా, తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంలో, పర్యాటక జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం ఇప్పటివరకు అతని జట్టుకు సరైనదేనని నిరూపితమైంది.

Video: 'నన్నే ఎందుకు టార్గెట్ చేశారు'.. లైవ్ మ్యాచ్‌లో గొడవ పడిన పంత్, లిటన్ దాస్.. వైరల్ వీడియో
Ind Vs Ban Video Rishabh Pant Vs Liton Das
Venkata Chari
|

Updated on: Sep 19, 2024 | 3:29 PM

Share

Rishabh Pant and Litton Das Argument video: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఈ రోజు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభమైంది. కాగా, తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంలో, పర్యాటక జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం ఇప్పటివరకు అతని జట్టుకు సరైనదేనని నిరూపితమైంది. ఎందుకంటే టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఇంతలో, భారత జట్టు ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ లిటన్ దాస్‌తో గొడవపడుతూ కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

రిషబ్ పంత్, లిటన్ దాస్ వాగ్వాదం..

వాస్తవానికి, ఈ సంఘటన మొదటి రోజు లంచ్ విరామానికి ముందు 16వ ఓవర్లో కనిపించింది. ఆ ఓవర్ మూడో బంతికి పంత్ సింగిల్ తీయాలనుకున్నాడు. కానీ, యశస్వి జైస్వాల్ నిరాకరించి అతడిని వెనక్కి పంపాడు. ఈ సమయంలో, ఓ ఫీల్డర్ బంతిని విసిరాడు. బంతి పంత్ ప్యాడ్‌కు తగిలి మిడ్ వికెట్ వైపు వెళ్లింది. దీంతో భారత వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ పంత్ కాస్త అసంతృప్తిగా కనిపించాడు. పంత్ స్టంప్ మైక్ సహాయంతో లిటన్ దాస్‌తో, ‘అతన్ని విసరవద్దు అని చెప్పండి. నన్నే ఎందుకు బంతితో కొడుతున్నాడు’ అని చెప్పడం వినిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి..

హసన్ మహమూద్ తన జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించడం గమనార్హం. మొదట రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ని, ఆ తర్వాత విరాట్ కోహ్లీని తన బలిపశువును చేశాడు. ఈ బంగ్లాదేశ్ బౌలర్ ముందు టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ నిస్సహాయంగా కనిపించింది. ఆ తర్వాత యశస్వి జైస్వాల్‌తో పాటు రిషబ్ పంత్ బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత వీరిద్దరూ పెవిలియన్ చేరారు.

మ్యాచ్ పరిస్థితి..

ప్రస్తుతం వార్త రాసే సమయానికి భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జడేజా 32, అశ్విన్ 43 పరుగులతో నిలిచారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
టూరిస్టులు ఎగిరి గంతేసే న్యూస్..! జనవరిలో విశాఖలో పండగే పండగ..
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
పగటి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలు!
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
హైదరాబాద్‌లో తొలి తరహా లగ్జరీ మేకప్ స్టూడియో..
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
నెల్లూరు లేడీ డాన్‌ అరుణపై పీడీ యాక్ట్‌.. కడప జైలుకు తరలింపు
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
హృతిక్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. టీమిండియా తోపు క్రికెటర్ భార్య
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
గుండెకు హాని చేసే ఆహారాలు.. ఈ 5 రకాల ఫుడ్స్‌కు దూరంగా ఉండండి!
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
టేస్టీగా ఉన్నాయని ఆ ఫుడ్స్ అతిగా తినేశారంటే.. మీ కిడ్నీ షెడ్డుకే
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
అఖండ 2 సినిమాలో బాలయ్య కూతురిగా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే..
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
భారతీయులు 5201314 నంబర్‌ను ఎందుకు ఎక్కువ సెర్చ్‌ చేశారు?
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్
అనుష్కతో సినిమా చేస్తున్న డైరెక్టర్‌‌కు నాగార్జున వార్నింగ్