Virat Kohli : మెస్సీని కలవడానికా ? లేక బ్యాట్ పట్టడానికా? ముంబైకి చేరుకున్న కోహ్లీ..ఎందుకు వచ్చాడంటే ?
Virat Kohli : భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కొద్ది రోజులు కుటుంబంతో గడపడానికి యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 13న ఆయన తన భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు.

Virat Kohli : భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కొద్ది రోజులు కుటుంబంతో గడపడానికి యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 13న ఆయన తన భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కోహ్లీ తిరిగొచ్చిన సమయంపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
మెస్సీని కలవడానికే వచ్చారా?
ప్రస్తుతం ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 14 ఏళ్ల తర్వాత మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. డిసెంబర్ 13 తెల్లవారుజామున 2 గంటలకు కోల్‌కతాకు చేరుకున్న మెస్సీ, సాల్ట్ లేక్ స్టేడియాన్ని సందర్శించారు. లక్షలాది మంది అభిమానుల మధ్య కేవలం 20 నిమిషాలు గడిపిన తర్వాత, ఆయన మధ్యాహ్నం కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. సరిగ్గా మెస్సీ భారత్‌లో ఉన్న సమయంలోనే కోహ్లీ ముంబైకి చేరుకోవడంతో ఆయన మెస్సీని కలవడానికే వచ్చారని అభిమానులు పెద్ద ఎత్తున ఊహించడం మొదలుపెట్టారు.
కోహ్లీ రాకకు అసలు కారణం ఇదే
అయితే, కోహ్లీ మెస్సీని కలవడానికి ముంబైకి రాలేదని తేలింది. త్వరలో జరగబోయే విజయ్ హజారే ట్రోఫీ 2025/26 కోసం సన్నాహాలు మొదలుపెట్టడానికే ఆయన భారత్‌కు తిరిగి వచ్చారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ధృవీకరించిన దాని ప్రకారం.. కోహ్లీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ జట్టు తరఫున కొన్ని విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లలో ఆడనున్నారు.
దేశవాళీ క్రికెట్ ఆడటం తప్పనిసరి
జాతీయ జట్టుకు ఆడనప్పుడు తప్పనిసరిగా దేశవాళీ మ్యాచ్‌లలో ఆడాలని బీసీసీఐ జాతీయ ఆటగాళ్లకు నిబంధన పెట్టింది. ఈ నిబంధన ప్రకారమే కోహ్లీ కూడా ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడాల్సి ఉంది. ఈ దేశవాళీ మ్యాచ్‌లలో ఆడిన తర్వాతే ఆయన వచ్చే ఏడాది ఆరంభంలో జరగబోయే న్యూజిలాండ్ సిరీస్‌లో పాల్గొననున్నారు.
Virat Kohli and Anushka Sharma snapped at the Private Airport, Mumbai🥹🫶🏻 pic.twitter.com/X0nxSJOVFr
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) December 13, 2025
కోహ్లీ ఫామ్ అద్భుతం
కోహ్లీ ఇటీవల సౌతాఫ్రికా సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో కలిపి 100కు పైగా సగటుతో ఏకంగా 302 పరుగులు చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రెండు డక్‌లు చేసిన కోహ్లీపై సందేహాలు మొదలైనా, సౌతాఫ్రికా సిరీస్‌లో అదరగొట్టి 2027 వన్డే ప్రపంచకప్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




