Video: ఇది క్యాచ్ కాదు.. అంతకుమించి.. 3 సెకండ్లలో మ్యాచ్‌నే మార్చేసిన బిష్ణోయ్.. చిరుతలా దూకి, ఒంటి చేత్తో కళ్లు చెదిరేలా
Ravi Bisnoi Incredible Catch: కివీ జట్టు స్టార్, అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ, విలియమ్సన్ ఎక్కువసేపు పిచ్‌పై నిలవలేకపోయాడు. అతడిని ఔట్ చేసేందుకు రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్ పట్టడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బంతి బిష్ణోయ్‌కి దూరంగా ఉంది. కానీ, చిరుతపులిలా గాలిలో డైవ్ చేసి ఒంటి చేత్తో అద్భుతంగా క్యాచ్ పట్టాడు. కేన్ 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. రవి బిష్ణోయ్ తీసుకున్న ఈ క్యాచ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బిష్ణోయ్ పట్టుకున్న క్యాచ్ వీడియో వైరల్ అవుతోంది.

Ravi Bisnoi Incredible Catch: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) స్పిన్నర్ రవి బిష్ణోయ్ ‘క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్’గా పిలుస్తున్న ఓ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఈ బౌలర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా 21వ మ్యాచ్ లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్ 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. అయితే దీనికి ధీటుగా గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. శుభ్‌మన్ గిల్-సాయి సుదర్శన్ జట్టుకు శుభారంభం అందించారు. అయితే పవర్‌ప్లే చివరి బంతికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు.
ఆ తర్వాత, కివీ జట్టు స్టార్, అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ, విలియమ్సన్ ఎక్కువసేపు పిచ్‌పై నిలవలేకపోయాడు. అతడిని ఔట్ చేసేందుకు రవి బిష్ణోయ్ అద్భుత క్యాచ్ పట్టడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
మైదానంలో సూపర్‌మ్యాన్‌గా మారిన రవి బిష్ణోయ్..
𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 😲
Flying Bishoni ✈️
Ravi Bishnoi pulls off a stunning one-handed screamer to dismiss Kane Williamson 👏👏
Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvGT pic.twitter.com/Le5qvauKbf
— IndianPremierLeague (@IPL) April 7, 2024
యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్‌ను బౌలింగ్ చేస్తున్నాడు. బిష్ణోయ్ వేసిన ఓవర్ తొలి బంతికే కేన్ విలియమ్సన్ స్ట్రయిక్‌లో ఉన్నాడు. అయితే ఆ ఓవర్ రెండో బంతికి విలియమ్సన్ విచిత్రమైన షాట్ ఆడాడు. బౌలర్ రవి బిష్ణోయ్ వైపు గాలిలోకి బంతిని కొట్టాడు.
బంతి బిష్ణోయ్‌కి దూరంగా ఉంది. కానీ, చిరుతపులిలా గాలిలో డైవ్ చేసి ఒంటి చేత్తో అద్భుతంగా క్యాచ్ పట్టాడు. కేన్ 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. రవి బిష్ణోయ్ తీసుకున్న ఈ క్యాచ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బిష్ణోయ్ పట్టుకున్న క్యాచ్ వీడియో వైరల్ అవుతోంది.
రవి బిష్ణోయ్ 3 సెకన్లలో క్యాచ్ పట్టి, మ్యాచ్‌ను తిప్పేశాడు..
రవి బిష్ణోయ్ వేసిన ఓవర్ రెండో బంతికి ఈ అద్భుతమైన దృశ్యం కనిపించింది. విలియమ్సన్ యొక్క డైరెక్ట్ షాట్ 22-గజాల ప్రాంతాన్ని దాటకముందే, బిష్ణోయ్ దానిని క్యాచ్ చేశాడు. కేవలం 3 సెకన్ల వ్యవధిలో తన కుడివైపు గాలిలో దూకి ఈ అద్భుత ఫీట్ చేశాడు. రెప్పపాటు కాలంలో బ్యాట్స్‌మెన్‌ను డగౌట్‌కు పంపిన ఈ క్యాచ్ గుజరాత్ జట్టును షేక్ చేసేలా కనిపించింది. ఎందుకంటే, ఇక్కడి నుంచి గుజరాత్ టైటాన్స్ ఆలౌట్ అయి మ్యాచ్‌లో ఓడిపోయోలా చేసింది. ఐపీఎల్ పిచ్‌పై గుజరాత్ ఆలౌట్ కావడం ఇది రెండోసారి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..