దిగ్గజాల ఎలైట్ లిస్ట్‌లో రోహిత్.. ఆరో ఓపెనర్‌గా స్పెషల్ రికార్డ్
TV9 Telugu
23 February 2025
ఆదివారం దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఇండియా vs పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా 9000 పరుగుల మార్కును దాటాడు.
9000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఇద్దరు భారతీయులు - సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ - సహా ఆరుగురు ఓపెనర్ల ఎలైట్ జాబితాలో రోహిత్ చేరాడు.
ఈ మ్యాచ్‌కు ముందు, రోహిత్ ఈ ఘనత సాధించడానికి మరో పరుగు మాత్రమే అవసరమైంది. కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ 20 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
రోహిత్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్ కూడా ఉంది. ఉన్నది కొద్దిసేపే అయినా, పాక్ బౌలర్లను దడదడలాడించాడు. దూకుడుగా ఆడుతున్న క్రమంలో షాహిన్ షా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన మునుపటి మ్యాచ్‌లో రోహిత్ వన్డే క్రికెట్‌లో 11000 పరుగులు పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న రెండవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
వన్డేల్లో 9000 పరుగులు చేసిన ఓపెనర్లలో మొత్తం ఐదుగురు ఉన్నారు. వీరిలో సచిన్ టెండూల్కర్, సనల్ జయసూర్య, క్రిస్ గేల్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, సౌరవ్ గంగూలీ ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో రోహిత్ శర్మ చేరాడు.