మీటర్ ట్యాంపరింగ్ పెట్రోల్ బంకులో రూ. కోట్లు కొల్లగొట్టారు
పెట్రోల్ బంకుల్లో అనేక రకాల మోసాలను మనం చూసాం. కానీ అనంతపురం జిల్లాలో జరిగిన ఈ మోసం రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు అంటున్నారు విజిలెన్స్ అధికారులు… విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పెట్రోల్ బంక్‌లోని కొత్త రకం మోసం బయటపడింది. ఎలక్ట్రికల్ చిప్ అమర్చి రీడింగ్ ను టాంపర్ చేస్తూ.. పెట్రోల్ బంక్ యాజమాన్యాలు… వాహనదారులను నిలువునా మోసం చేస్తున్నాయి.
ఆఖరికి లీగల్ మెట్రాలజీ అధికారులకు కూడా తెలియకుండా మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్ ల గుట్టును విజిలెన్స్ అధికారులు బట్ట బయలు చేశారు. పక్కా సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అనంతపురం శివారు ప్రాంతమైన సోమలదొడ్డిలోని శ్రీ విజయలక్ష్మి ఆటో కేర్ అండ్ ఫ్యూయల్ స్టేషన్ అనే పెట్రోల్ బంకులో తనిఖీలు నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ పంపులను తనిఖీ చేయగా… డీజిల్ పంప్ ఉన్న డిజిటల్ మీటర్ కు చిప్ అమర్చి ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఏడాది క్రితం డీజిల్ పంపుకు హైదరాబాదు నుంచి ఓ టెక్నీషియన్ ను తీసుకొచ్చి చిప్ అమర్చినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీంతో విజయలక్ష్మి ఆటో కేర్ ఫ్యూయల్ స్టేషన్ పెట్రోల్ బంకులో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో చిప్ బాగోతం బయటపడింది. ఒక సంవత్సరంలోనే సుమారు ఒక పంపు ద్వారా రెండు కోట్ల పైచిలుకు రూపాయిలు మోసం చేసినట్లు విజిలెన్స్ తనిఖీల్లో అధికారులు గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లిఫ్టులోకి కుక్కను తీసుకురావద్దనందుకు..బాలుడిని తీవ్రంగా కొట్టిన మహిళ
అదృశ్యమైన జ్యోతిష్యుడు అస్థిపంజరమయ్యాడు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ సీన్స్
పిల్లలు చనిపోతుంటే ఫోటో షూట్ చేస్తారా.. జెలెన్‌స్కీ మీద మస్క్ మండిపాటు
పాఠశాలకు వెళ్తూ గుండె*పోటుతో కుప్పకూలిన విద్యార్థిని
ప్రియురాలితో ఉండగా భర్తను.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
