ప్రియురాలితో ఉండగా భర్తను.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
అక్రమ సంబంధం పెట్టుకున్న జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్‌ను అతడి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జానకిరామ్‌తో పాటు సదరు మహిళను బంధువులు చితకబాదారు. విషయం తెలుసుకున్న వారాసిగూడ పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్లిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జీహెచ్ఎంసీలో అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్ గత కొంతకాలంగా విధి నిర్వహణ పేరుతో సరిగా ఇంటికి రావడం లేదు. దాంతోపాటు ఫోన్లు సైతం ఎక్కువగా మాట్లాడుతుండడంతో భార్య కల్యాణికి అనుమానం వచ్చింది. దీంతో భర్త పై నిఘా పెట్టిన కళ్యాణి..వారసిగూడలో ఒక అపార్ట్‌మెంట్‌లో తనకన్నా 20 ఏళ్ల వయసు తక్కువగా ఉన్న మహిళ తో జానకిరామ్ కలిసి ఉన్నట్లు గుర్తించింది. శుక్రవారం ఉదయం ఆ అపార్ట్మెంట్‌కు బంధువులతో కలిసి వెళ్లిన కల్యాణి ఆ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారని ఆరోపించారు. గతంలో పలుమార్లు తాను వారిని పట్టుకున్నట్లు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పురుషులకు శుభవార్త! మహిళల ఉచిత బస్సు ఇబ్బంది ఇక తప్పినట్లే..!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

