పురుషులకు శుభవార్త! మహిళల ఉచిత బస్సు ఇబ్బంది ఇక తప్పినట్లే..!
మహిళలకు ఉచిత బస్సు పథకం మొదలైనప్పటి నుంచి బస్సులో నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో వారు భారీగా బస్సులు ఎక్కడం వల్ల పురుషులు టికెట్లు కొన్నా సీట్లు దొరకని పరిస్థితి ఉంది. దీంతో పురుషులు ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై, ఆర్టీసీపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
తాము డబ్బులు పెట్టి టికెట్లు కొన్నా కనీసం బస్సులో నిలబడే పరిస్థితి లేదని అంటున్నారు. అయితే ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణతోపాటు కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. తెలంగాణ కంటే ముందే ఈ ఉచిత బస్సు పథకాన్ని ఆ రాష్ట్రంలో అమలు చేసారు. ఇక కర్ణాటకలోని బస్సుల్లో పురుషులకు కూర్చేనేందుకు కాదు కదా.. కనీసం నిలబడేందుకు కూడా కొన్ని సార్లు చోటు ఉండటం లేదు. దీనిపై చాలా మంది పురుషులు ఇప్పటికే చాలాసార్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బస్సుల్లో కొన్ని సీట్లు పురుషులకు కేటాయించాలని కర్ణాటక ఆర్టీసీకి సిద్ధరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!
