అదృశ్యమైన జ్యోతిష్యుడు అస్థిపంజరమయ్యాడు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ సీన్స్
విశాఖపట్నంలో అదృశ్యమైన జ్యోతిష్యుడు అస్థిపంజరమై కనిపించాడు. బీమిలి బీచ్ రోడ్డు కాపులుప్పాడలో అస్థిపంజరం కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అస్థిపంజరం కనిపించిన చోటే రుద్రాక్షలు, ఎరుపు, పసుపు పూసల దండలు, సగం కాలిన కనకదుర్గ ఫోటో, ఆకుపచ్చ పంచె లాంటి ఆనవాళ్లు కనిపించాయి.
వీటి ఆధారంగా చనిపోయింది పెందుర్తికి చెందిన జ్యోతిష్యుడు, 50 ఏళ్ల మోతి అప్పన్న అని గుర్తించారు. ఫిబ్రవరి 9న జ్యోతిష్యుడు అప్పన్నను భార్యాభర్తలు హత్య చేశారని తెలుస్తోంది. జ్యోతిష్యం పేరు చెప్పి తన భార్యతో అప్పన్న అసభ్యంగా ప్రవర్తించాడనే కోపంతోనే వారు అతన్ని చంపేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. భీమిలి మండలం నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు, మౌనిక దంపతులు ఆనందపురం మండలం లొడగలవానిపాలెంలో నివాసముంటున్నారు. జ్యోతిష్యుడు అప్పన్న గురించి తెలుసుకున్న మౌనిక ఫిబ్రవరి 7న పూజల కోసం ఆయన్ను ఇంటికి పిలిచింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అప్పన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో అప్పన్నను అంతమొందించాలని అతడు ప్రణాళిక వేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లలు చనిపోతుంటే ఫోటో షూట్ చేస్తారా.. జెలెన్‌స్కీ మీద మస్క్ మండిపాటు
పాఠశాలకు వెళ్తూ గుండె*పోటుతో కుప్పకూలిన విద్యార్థిని
ప్రియురాలితో ఉండగా భర్తను.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
పురుషులకు శుభవార్త! మహిళల ఉచిత బస్సు ఇబ్బంది ఇక తప్పినట్లే..!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

