పాఠశాలకు వెళ్తూ గుండె*పోటుతో కుప్పకూలిన విద్యార్థిని
గుండెపోటు మరణాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఒకప్పుడు 60ఏళ్లు పైబడ్డ వారికే గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు.. ఏ క్షణమైనా ఎవ్వరికైనా హార్ట్ ఎటాక్ వస్తోంది. నిలబడ్డవాళ్లు సడెన్‌గా కుప్పకూలిపోతున్నారు. ఏమైందో ఆరాతీసే లోపే ప్రాణాలు విడుస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేదు. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ.. ఉల్లాసంగా కనిపించినవాళ్లు సడెన్‌గా కూలిపోతున్నారు.
పాఠశాలకు వెళ్తున్నానని బయలుదేరిన విద్యార్థిని ఒక్కసారిగా గుండెపోటు వచ్చి రోడ్డుపై కళ్లు తిరిగి పడిపోయింది. బాలికను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. 14 ఏళ్ల శ్రీనిధి కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. కామారెడ్డి పట్టణం కల్కినగర్ కాలనిలో నివాసం ఉండగా, అప్పుడప్పుడు పెద్దనాన్న ఇంటి వద్దే ఉండి పాఠశాలకు వస్తుంటుంది. ఎప్పటిలాగే కల్కినగర్ నుంచి నడుచుకుంటూ పాఠశాలకు వస్తుండగా జీవదాన్ స్కూల్ వద్ద ఒక్కసారిగా గుండెపోటుతో కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే హార్ట్ బీట్ కొట్టుకోవడం ఆగిపోయిందని వైద్యులు తెలిపారు. వైద్యులు సీపీఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. శ్రీనిధి మృతితో అటు సింగరాయిపల్లి గ్రామం, ఇటు పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదువు విషయంలో శ్రీనిధి ముందంజలో ఉండేదని, మంచి విద్యార్థినిని తాము కోల్పోయామని పాఠశాల ప్రిన్సిపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులో గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబ శోకసంద్రంలో మునిగిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియురాలితో ఉండగా భర్తను.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
పురుషులకు శుభవార్త! మహిళల ఉచిత బస్సు ఇబ్బంది ఇక తప్పినట్లే..!

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
