Nepal Earthquake: నేపాల్, బిహార్‌లో భూకంపం! భయంతో పరుగులుపెట్టిన జనం
శుక్రవారం తెల్లవారుజామున నేపాల్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. హిమాలయాల మధ్య ప్రాంతంలోని సింధుపాల్‌చౌక్ జిల్లాలో కేంద్రీకృతమైన ఈ భూకంపం, భారత్‌లోని బిహార్, బెంగాల్, సిక్కింలలోనూ ప్రకంపనలను కలిగించింది. ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపినప్పటికీ, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మరింత సమాచారం కోసం ఎదురు చూడాల్సి ఉంది.
హిమాలయ పర్వత ప్రాంతంలో మళ్లీ భూకంపం సంభవించింది. మన మిత్రదేశం నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఈ భూకంపం వచ్చింది. దీంతో ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రియాక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత నమోదైంది. ఆ ప్రకంపనలు మనదేశంలోనూ కనిపించాయి. బిహార్‌లో కూడా ఈ భూకంపం ఎఫెక్ట్ కనిపించింది. అసోంలో భూకంపం వచ్చిన 24 గంటల్లోనే నేపాల్‌లో భూ ప్రకంపనలు రావడం కలవరపెడుతోంది. హిమాలయా మధ్య ప్రాంతంలోని సింధుపాల్‌చౌక్ జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. నేపాల్‌లో మాత్రమే కాకుండా భారత్, టిబెట్, చైనా సరిహద్దు ప్రాంతాలతో పాటు.. బిహార్, బెంగాల్, సిక్కింలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలు తమ ఇళ్లు, భవనాలోంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఈ భూకంపం కారణంగా ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

