ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీల వర్షం.. 27 ఏళ్ల ప్రపంచ రికార్డ్ బ్రేక్

TV9 Telugu

27 February 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కీలక దశకు చేరుకుంది. భారత్, న్యూజిలాండ్ సెమీస్ చేరగా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్తాన్, సౌతాఫ్రికా జట్లు 2 స్థానాల కోసం పోటీపడుతున్నాయి.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశ ముగియనుంది. అయితే, ఈ టోర్నమెంట్‌లో సెంచరీల ప్రపంచ రికార్డు నమోదైంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్‌లో మరే ఇతర ఎడిషన్‌లో కంటే అత్యధిక సెంచరీలు నమోదయ్యాయి. 

ఇప్పటివరకు, 7 మ్యాచ్‌ల్లో 11 సెంచరీలు నమోదయ్యాయి. ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. దీంతో మరిన్ని సెంచరీలు నమోదయ్యే ఛాన్స్ ఉంది.

అంతకుముందు, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో, 15 మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు నమోదయ్యాయి. సంయుక్తంగా ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉండేది. కానీ, 2025లో బ్రేక్ అయింది.

2002 ఛాంపియన్స్ ట్రోఫీలో, 16 మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు నమోదయ్యాయి. ఆ సమయంలో, ఈ టోర్నమెంట్ చరిత్రలో మొదటిసారిగా, ఏ ఎడిషన్‌లోనైనా సెంచరీల సంఖ్య 10కి చేరుకుంది.

ఈ టోర్నమెంట్ 1998 లో ప్రారంభమైంది. 2006 ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 7 సెంచరీలు నమోదయ్యాయి.  

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం తరపున విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్ సెంచరీలు సాధించారు. టీమిండియా తరపున మరిన్ని సెంచరీలు వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బెక్ డకెట్, ఇబ్రహీం జద్రాన్, జో రూట్, టామ్ లాథమ్, జోస్ ఇంగ్లిస్, రాచిన్ రవీంద్ర, విల్ యంగ్, తౌహీద్ హృదయ, ర్యాన్ డేవిడ్ రికెల్టన్ సెంచరీలు సాధించారు.