AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Budget 2025 Highlights: 3 లక్షల కోట్లతో ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్.. హైలైట్స్ ఇవే

Andhra Pradesh Budget 2025 live updates in Telugu: అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రూ.3,22,359.33 కోట్లతో ఏపీ బడ్జెట్‌ ఉండగా.. రెవెన్యూ వ్యయం అంచనా- రూ.2,51,162 కోట్లని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలను.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టిన ఆర్థిక మంత్రి. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు పయ్యావుల. తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.

AP Budget 2025 Highlights: 3 లక్షల కోట్లతో ఏపీ పూర్తిస్థాయి బడ్జెట్.. హైలైట్స్ ఇవే
Ap Assembly
Ravi Kiran
|

Updated on: Feb 28, 2025 | 3:07 PM

Share

అధికారంలోకొచ్చి తొమ్మిదినెలలు. ఏపీ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పై ఎన్నో అంచనాలున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్‌పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు సమీక్షించారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ప్రధానంగా అధికారంలోకొచ్చేందుకు దోహదపడ్డ సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ని రూపొందించారు.

మరోవైపు అసెంబ్లీలో పయ్యావుల కేశవ్‌.. మండలిలో కొల్లు రవీంద్ర.. బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈసారి ఏపీ బడ్జెట్‌.. 3లక్షల కోట్ల రూపాయల మార్క్‌ దాటే అవకాశం కనిపిస్తోంది‌. ముఖ్యంగా సూపర్ సిక్స్, అమరావతి, పోలవరం, వ్యవసాయం, విద్యాఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఉండనుంది. వ్యవసాయ బడ్జెట్‌ 50వేల కోట్ల రూపాయలు ఉండే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో అచ్చెన్నాయుడు.. మండలిలో నారాయణ ప్రవేశపెడతారు. 2047 నాటికి 15శాతం GSDP వృద్ధి.. 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా బడ్జెట్‌లో ప్రణాళికలు వేయబోతోంది కూటమి ప్రభుత్వం. ఆర్థిక లోటు ఉన్నా కూడా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పోలవరం, అమరావతికి భారీ కేటాయింపులు జరిపే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Feb 2025 12:04 PM (IST)

    ఏపీ బడ్జెట్ హైలైట్స్

    సూపర్‌సిక్స్‌ పథకంలో ఒకటైన తల్లికి వందనం పథకం కింద 15వేల రూపాయలను కొత్త విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు పయ్యావుల కేశవ్‌ ప్రకటించారు. తల్లికి వందనంతో పాటు, మొత్తం పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లను కేటాయించారు.

  • 28 Feb 2025 12:03 PM (IST)

    ఏపీ బడ్జెట్ హైలైట్స్

    అమరావతి నిర్మాణానికి ఆరువేల కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఇవన్నీ బయటనుంచి వచ్చేనిధులు అనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమరావతికి నిధులు కేటాయించడం లేదని పయ్యావుల కేశవ్‌ చెప్పారు. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 6,705 కోట్లను, సాగునీటి ప్రాజెక్టులకు 11,314 కోట్లను కేటాయించారు.

  • 28 Feb 2025 12:03 PM (IST)

    ఏపీ బడ్జెట్ హైలైట్స్

    మొత్తం మూడు లక్షల 22వేల 359 కోట్ల రూపాయల వ్యయ అంచనాతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రెండు లక్షల 51వేల, 162 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. మూలధన వ్యయం 40,635 కోట్లుగా ఉండొచ్చనీ, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు,ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా ఉండొచ్చని పయ్యావుల కేశవ్‌ అంచనా వేశారు.

  • 28 Feb 2025 12:02 PM (IST)

    ఏపీ అసెంబ్లీ హైలైట్స్..

    అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా లేచి నిలబడగా లేనిది.. ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి నిలబెట్టలేమా అనే మాటల స్ఫూర్తితో ఏపీ ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

  • 28 Feb 2025 11:50 AM (IST)

    రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కామెంట్స్

    స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనే కూటమి లక్ష్యం

    మే నెలలో తల్లికి వందనం పథకం

    ఒకే కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15000 చొప్పున ఇస్తాం

    ఇచ్చిన హామీ ప్రకారం మత్స్యకారులు కూడా వేట నిషేధ కాలంలో 20000 ఆర్థిక సాయం

    పేదరిక నిర్మూలన లక్ష్యంగా… అన్నదాతకు ఏటా 20,000 ఇస్తాం..

  • 28 Feb 2025 11:45 AM (IST)

    ఏపీ బడ్జెట్

    డ్రిప్ ఇరిగేషనుకు ప్రాధాన్యత

    85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు అనుమతులు.

    గ్రామీణ ప్రాంతాల్లో 95.44 లక్షల ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేలా ప్రణాళికలు.

    గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పశువుల పాకలు వంటి 30 వేల పనులను ఇప్పటికే మంజూరు చేసినట్టు వెల్లడి.

    4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సి.సి.రోడ్లల్లో, ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తైనట్టు స్పష్టీకరణ.

    మిగిలిన 1300 కి.మీ. మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నట్టు బడ్జెట్టులో ప్రస్తావన.

  • 28 Feb 2025 11:45 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు

    తెలుగు భాషాభివృద్ధికి రూ. 10 కోట్లు కేటాయింపు.

    తొలిసారిగా తెలుగు భాషకు నిధులను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం.

    తెలుగు భాషకు తామిచ్చే ప్రాధాన్యతను తెలియచెప్పేలా నిధుల కేటాయింపు.

    మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంపై వ్యతిరేక ప్రచారం కోసం బడ్జెట్టులో ప్రత్యేక కేటాయింపులు.

    నవోదయం 2.0 స్కీం కింద మద్యపాన, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం నిధుల కేటాయింపు.

    కాలుష్య రహిత ఆంధ్రగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేపడుతున్నట్టు బడ్జెట్టులో ప్రస్తావన.

    రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేలా చర్యలు.

    జీరో కాలుష్యం ఉండేలా ప్రణాళికలు రూపకల్పనపై బడ్జెట్టులో ప్రస్తావన.

  • 28 Feb 2025 11:40 AM (IST)

    ఏపీ బడ్జెట్

    ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు.

    టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్టులో గ్రీన్ సిగ్నల్.

    ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా రూ. 50 వేలు, ఎస్టీలకు అదనంగా రూ. 75 వేలు ఇవ్వనున్నట్టు బడ్జెట్టులో వెల్లడి.

    చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచిన ప్రభుత్వం.

    దీపం 2.0 కింద నిధుల కేటాయింపు.

    ఆదరణ పథకం పునః ప్రారంభించిన కూటమి ప్రభుత్వం.

  • 28 Feb 2025 11:40 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు

    2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్టులో విద్యా, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు.

    అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్.

    ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడంతో స్థానిక సంస్థలకు తగ్గనున్న విద్యుత్ ఛార్జీల భారం.

    కేంద్రీకృత బిల్లుల చెల్లింపుల విధానం నుంచి మున్సిపాల్టీలకు విముక్తి.

    2024 ఏప్రిల్ నెల నుంచి తమ బిల్లులను తామే చెల్లింపులు జరుపుకునేలా మున్సిపాల్టీలకు స్వేచ్ఛ.

    క్యాపిటల్ ఎక్స్ పెడించర్ ప్రాజెక్టులు చేపట్టడానికిప్రత్యేక ప్రణాళికలు.

    ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులకు నిర్ణయం.

    ప్రొత్సాహకంగా ప్రాజెక్టులో 20 శాతం మేర వయబులిటి గ్యాప్ ఫండింగ్ ఇచ్చేలా స్కీం డిజైన్ చేసిన కూటమి ప్రభుత్వం.

    ప్రాజెక్టుల గ్యాప్ ఫండింగ్ స్కీం కోసం రూ. 2 వేల కోట్లతో కార్పస్ ఫండ్.

  • 28 Feb 2025 11:35 AM (IST)

    ఏపీ బడ్జెట్

    చేనేతలకూ ఉచిత విద్యుత్ అమలు.

    చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్.

    మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

    నాయీ బ్రహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం.

    వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రామాలు.

  • 28 Feb 2025 11:30 AM (IST)

    ఏపీ బడ్జెట్

    1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తింపు.

    విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను జమ చేయనున్న ప్రభుత్వం.

    స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు.

    ఎటువంటి జాప్యం లేకుండా.. కార్పోరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్టులో ప్రస్తావన.

    ఈ ఏడాదిలోనే రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు.

    ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్టులో వెల్లడి.

    ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

  • 28 Feb 2025 11:25 AM (IST)

    ఏపీ బడ్జెట్

    2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్టులో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్ద పీట వేశారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు ఇచ్చారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తుండగా.. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వరిస్తాయన్నారు.

  • 28 Feb 2025 11:20 AM (IST)

    ఏపీ బడ్జెట్‌

    ఏపీ బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవ కోసం 6300 కోట్లు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 62 కోట్లు, ధరల స్థికరణ నిధి కోసం 300 కోట్లు, హంద్రీనీవా ఉత్తరాంధ్ర సృజన స్రవంతి గోదావరి డెల్టా కృష్ణ డెల్టా ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6705 కోట్లు, జల్జీవన్ మిషన్ కోసం 2800 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 500 కోట్లు కేటాయించారు.

  • 28 Feb 2025 11:20 AM (IST)

    ఆర్దిక మంత్రి కామెంట్స్..

    జాతీయ స్థాయిలో డ్రిప్ ఇరిగేషనుపై వేసిన టాస్క్ ఫోర్సుకు చంద్రబాబే ఛైర్మనుగా ఉన్నారు. చంద్రబాబు ఇవాళ ఏం ఆలోచిస్తారో.. రేపు దేశం అదే ఆలోచిస్తుందనడానికి డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టే నిదర్శనం. ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ లేని రాష్ట్రం లేదు.. డ్రిప్ ఇరిగేషన్ లేని పొలం లేదు. ఇలాంటి కీలకమైన డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.

  • 28 Feb 2025 11:15 AM (IST)

    ఆర్ధిక మంత్రి కామెంట్స్..

    ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తెచ్చినప్పటి పరిస్థితులను బడ్జెట్ ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు పయ్యావుల. డ్రిప్ ఇరిగేషనుపై అధ్యయనానికి ఇజ్రాయెల్ వెళ్లిన బృందంలో తానూ సభ్యుడిగా ఉన్నట్టు చంద్రబాబుకు గుర్తు చేశారు ఆర్థిక మంత్రి. దేశంలో తొలిసారిగా ఉమ్మడి ఏపీలోనే డ్రిప్ ఇరిగేషన్ పైలెట్ ప్రాజక్టును అమలు చేశాం.

  • 28 Feb 2025 11:10 AM (IST)

    ఆర్ధిక మంత్రి కామెంట్స్

    రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజనులా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. రాజధాని అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అని నిరూపితమైంది. రాజధాని నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్టు నుంచి రూపాయి కూడా కేటాయించడం లేదు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌, హడ్కో వంటి ఆర్థిక సంస్థల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతికి నిధులు సమకూరాయి.

  • 28 Feb 2025 11:05 AM (IST)

    పయ్యావుల కేశవ్ కామెంట్స్..

    డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మార్గదర్శకంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తున్నాం. నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటను ఎంచుకున్నారు. తమను తాము కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని మరువలేం.

  • 28 Feb 2025 11:00 AM (IST)

    పయ్యావుల కామెంట్స్..

    బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కీలక కామెంట్లు చేశారు. గత ప్రభుత్వ తప్పిదాలను.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు. తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పులు చేయడమే తప్ప.. అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరి చేస్తున్నాం. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరపకపోవడంతో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదు.

  • 28 Feb 2025 10:45 AM (IST)

    బడ్జెట్ లెక్కలు ఇలా..

    2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.322359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. తొలిసారి రూ. 3 లక్షలు కోట్లు దాటింది రాష్ట్ర బడ్జెట్. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటింది ఏపీ బడ్జెట్. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్యలోటు రూ. 79,926 కోట్లు, మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా ఉంది.

  • 28 Feb 2025 10:41 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు

    కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇవాళ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మూడు లక్షల ఇరవై రెండు వేల 359 కోట్లతో 2025 26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆయన. వ్యవసాయానికి 48 వేల కోట్ల బడ్జెట్, పాఠశాల విద్యాశాఖ 31 వేల ఎనిమిది వందల ఆరు కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు, వైద్యరోగ్య శాఖకు 19,265 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18,848 కోట్లు, జలవనరుల శాఖకు 18 ఇరవై కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పురపాలక శాఖకు 13,862 కోట్లు, ఇంధన శాఖకు రూ 13,600 కోట్లు, వ్యవసాయ శాఖకు 11,636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు, రవాణా శాఖకు 8785 కోట్లు కేటాయించారు.

  • 28 Feb 2025 10:18 AM (IST)

    అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

    అమరావతి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

    మూడు లక్షల ఇరవై రెండు వేల 359 కోట్లతో 2025 26 వార్షిక బడ్జెట్

    వ్యవసాయానికి 48 వేల కోట్ల బడ్జెట్

    పాఠశాల విద్యాశాఖ 31 వేల ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయలు కేటాయింపు

    బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయింపు

    వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయింపు

    పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18848 కోట్లు కేటాయింపు

    జలవంతల శాఖకు 18 ఇరవై కోట్లు కేటాయిస్తూ నిర్ణయం

    పురపాలక శాఖకు 13862 కోట్లు కేటాయింపు

    ఇందన శాఖకు రూ 13,600 కోట్లు కేటాయిస్తూ ఇచ్చిన ఆర్థిక మంత్రి

    వ్యవసాయ శాఖకు 11636 కోట్లు

    సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు కేటాయింపు

    ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు కేటాయింపు

    రవాణా శాఖకు 8785 కోట్లు కేటాయింపు

  • 28 Feb 2025 10:05 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు

    కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటాను సమకూర్చి మరింత ప్రయోజనం పొందేలా ఆర్థిక శాఖ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. మొత్తంగా ఏపీ బడ్జెట్‌ ఈసారి రికార్డుస్థాయిలో 3లక్షల కోట్ల మార్కును దాటనుందని తెలుస్తోంది.

  • 28 Feb 2025 10:00 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు..

    సూపర్‌సిక్స్‌లో సామాజిక భద్రతా పెన్షన్లు, అన్నక్యాంటీన్లు, మూడు సిలిండర్ల పథకాలను ఇప్పటికే పట్టాలెక్కించింది ప్రభుత్వం. ఈ బడ్జెట్‌లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీలను పొందుపరచనుంది.

  • 28 Feb 2025 09:50 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు

    బడ్జెట్‌లో అమరావతిపై క్లియర్‌ పిక్చర్‌ ఇవ్వబోతోంది ప్రభుత్వం. విద్య, ఆరోగ్య రంగాలకు బడ్జెట్‌లో అత్యధిక ప్రాధాన్యమివ్వాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్ట్‌ ఏపీ సర్కారు టాప్‌ ప్రయారిటీ. పోలవరానికి ఇప్పటికే కేంద్రం 12వేల157 కోట్లను బడ్జెట్‌లో పొందుపరిచింది.

  • 28 Feb 2025 09:45 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు..

    అన్నదాత సుఖీభవ పథకానికి 53లక్షల 58వేలమంది రైతులను అర్హులుగా గుర్తించారు. కేంద్రం ఇచ్చే 6వేలకి అదనంగా రాష్ట్రప్రభుత్వం 14వేల చొప్పున మొత్తం 20వేల సాయం అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పథకం అమలుకు 10వేల 717 కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్క వేసింది.

  • 28 Feb 2025 09:40 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు..

    వరల్డ్ బ్యాంక్, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి 30వేల కోట్ల రూపాయలకు పైగా రుణాలకు హామీ తెచ్చుకుంది. అమరావతి కనెక్టివిటీ, రాజధాని సంబంధిత ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది.

  • 28 Feb 2025 09:35 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు

    కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉన్నా.. భూసేకరణ, పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చుపెట్టాల్సి ఉంది. మరోవైపు 16వ ఆర్థిక సంఘం నుంచి ప్రత్యేక సాయం కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

  • 28 Feb 2025 09:30 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు..

    సూపర్‌ సిక్స్‌ హామీల్లో ప్రధానమైన తల్లివందనం పథకంలో భాగంగా ప్రతి తల్లికి ఏడాదికి 15వేలు ఇవ్వాల్సి ఉంది. ఈ స్కీమ్‌ కోసం 69లక్షల 16వేలమందిని అర్హులుగా గుర్తించారు. మే నెల నుంచి అమలుచేయాలనుకుంటున్న ఈ పథకానికి సుమారు 10,300 కోట్లు అవసరమని అంచనావేశారు.

  • 28 Feb 2025 09:25 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు..

    రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా, సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామంటోంది కూటమి ప్రభుత్వం. మూడేళ్లలో 60వేల కోట్ల వ్యయంతో అమరావతిని పూర్తి చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

  • 28 Feb 2025 09:15 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు..

    ప్రధానంగా అధికారంలోకొచ్చేందుకు దోహదపడ్డ సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ని రూపొందించారు.

  • 28 Feb 2025 09:05 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు..

    2047 నాటికి 15శాతం స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి వృద్ధి రేటు సాధించడం, 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

  • 28 Feb 2025 09:00 AM (IST)

    ఏపీ బడ్జెట్ విశేషాలు..

    అధికారంలోకొచ్చి తొమ్మిదినెలలు. ఏపీ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పై ఎన్నో అంచనాలున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్‌పై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు సమీక్షించారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్‌ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.

Published On - Feb 28,2025 8:56 AM

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
ఆ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్ ఓపెన్..ఎక్కడంటే
ఆ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్ ఓపెన్..ఎక్కడంటే
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే